SIM Card ఫ్రాడ్ మరియు IMEI టాంపరింగ్ పై DoT ఉక్కుపాదం: వెంటనే మీ వివరాలు చెక్ చేసుకోండి.!
SIM Card ఫ్రాడ్ మరియు IMEI టాంపరింగ్ పై DoT ఉక్కుపాదం
మూడు సంవత్సరాల కట్టిన కారాగార శిక్షతో పాటు 50 లక్షల రూపాయల వరకు జరిమానా
మీ పేరు మీద లేదా మీ వివరాలతో ఏదైనా ఫ్రాడ్ జరిగితే అది మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది
SIM Card ఫ్రాడ్ మరియు IMEI టాంపరింగ్ పై DoT ఉక్కుపాదం మోపడానికి సిద్దమయ్యింది. దేశంలో సిం కార్డు మరియు ఐఎంఈఐ టాంపరింగ్ మోసాలు పెరిగిన తరుణంలో ఈ మోసాలను పూర్తిగా కట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఎవరైనా సరే సిమ్ కార్డు ఫ్రాడ్ లేదా ఐఎంఈఐ ట్యాంపరింగ్ కి పాల్పడినట్లయితే, మూడు సంవత్సరాల కట్టిన కారాగార శిక్షతో పాటు 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ తెలిపింది. అయితే, మీ పేరు మీద లేదా మీ వివరాలతో ఏదైనా ఫ్రాడ్ జరిగితే అది మీ మెడకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వెంటనే మీ సిమ్ కార్డు మరియు ఫోన్ ఐఎంఈఐ వివరాలు వెంటనే చెక్ చేసుకోండి.
SurveySIM Card మరియు IMEI ఎక్కడ చెక్ చేయాలి?
మీరు మీ పేరు మీద ఉన్న అన్ని సిమ్ కార్డు వివరాలు జస్ట్ వన్ మినిట్ లో తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు ప్రభుత్వం అందించిన ఉచిత పోర్టల్ Sanchar Saathi TAFCOP ని ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఇదే సైట్ నుండి మీ ఫోన్ ఐఎంఈఐ వివరాలు కూడా కంప్లీట్ గా తెలుసుకోవచ్చు, ఒక వేల మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే, మీరు ఇదే పోర్టల్ నుంచి కంప్లైంట్ ను కూడా రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది.
Also Read: Flipkart BBD Sale బిగ్ సౌండ్ బార్ డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
పేరు మీద ఉన్న SIM Card వివరాలు ఎలా చెక్ చేయాలి?
- ముందుగా tafcop.sancharsaathi.gov.in పోర్టల్ ఓపెన్ చేయాలి
- ఇందులో అడిగిన వద్ద బాక్స్ లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
- దీని క్రింద ఉన్న బాక్స్ లో CAPTCHA code ఎంటర్ చేయండి
- తర్వాత OTP కోసం రిక్వెస్ట్ చేయండి
- అందుకున్న OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
మీకు ఇక్కడ మీ పేరు మీద తీసుకున్న అన్ని మొబైల్ నెంబర్ లిస్ట్ అందిస్తుంది
అంతే, మీరు మీ పేరు మీద మీరు తీసుకున్న అన్ని మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మీరు ఉపయోగించని సిమ్ కార్డు ఉంటే, ఇదే పోర్టల్ నుంచి వెంటనే కంప్లైంట్ ని రిజిస్టర్ చేయండి.

IMEI ఎలా చెక్ చేయాలి?
- ముందేగా ceir.sancharsaathi.gov.in సైట్ ఓపెన్ చేయండి
- ఇక్కడ అప్లికేషన్ లో వచ్చే ఐఎంఈఐ వెరిఫికేషన్ పైన నొక్కండి
- ఇక్కడ వచ్చే కొత్త పేజీ లో క్యాప్చా మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
- OTP కోసం రిక్వెస్ట్ చేయండి మరియు వచ్చిన OTP ని ఎంటర్ చేయండి
- చివరిగా అడుగున ఉన్న సబ్మిట్ బటన్ నొక్కి పూర్తి చేయండి
అంతే, మీకు మీ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు అందిస్తుంది. ఈ విధంగా మీ వివరాలు వెరిఫికేషన్ చేసి మీ సిమ్ కార్డ్ మరియు ఫోన్ ను పూర్తి వెరిఫై చేయండి. ఇలా చేయడం చాలా అవసరం మరియు మీ వివరాలు పూర్తి స్థాయిలో మీ కట్టడిలో ఉన్నట్లు భరోసా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
