రూ. 1,099 ధరకే కొత్త Smart Watch విడుదల చేసిన ఐటెల్.!

HIGHLIGHTS

ఐటెల్ బ్రాండ్, రూ. 1,099 ధరకే కొత్త Smart Watch విడుదల చేసింది

ఈ స్మార్ట్ వాచ్ itel ICON-2 పేరుతో వచ్చింది

ఈ వాచ్ లో ఆకట్టుకునే ఫీచర్స్ ను అందించింది

రూ. 1,099 ధరకే కొత్త Smart Watch విడుదల చేసిన ఐటెల్.!

బడ్జెట్ ధరలో మంచి ప్రోడక్ట్స్ ను విడుదల చేస్తున్న బ్రాండ్ గా భారత్ యూజర్ల మనసు చొరగొన్న ఐటెల్ బ్రాండ్, రూ. 1,099 ధరకే కొత్త Smart Watch విడుదల చేసింది. ఐటెల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ itel ICON-2 పేరుతో వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ను చాలా చవక ధరలో విడుదల చేసినా ఈ వాచ్ లో ఆకట్టుకునే ఫీచర్స్ ను అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

itel ICON-2 Smart Watch

ఐటెల్ యొక్క ఈ ఐకాన్-2 స్మార్ట్ వాచ్ ను రూ. 1,099 ధరతో లాంఛ్ చేసింది. ఈ వాచ్ అమేజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ itel ICON-2 స్మార్ట్ వాచ్ యొక్క ప్రత్యేకతలను ఈ క్రింద చూడవచ్చు.

Also Read: 100 గంటల ప్లే టైమ్ తో విడుదలైన Boult Z40 Ultra ఇయర్ బడ్స్.!

itel ICON-2: ప్రత్యేకతలు

ఐటెల్ ఐకాన్-2 స్మార్ట్ వాచ్ పెద్ద 1.83 పరిమాణం కలిగిన HD డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 2.5D కర్వ్డ్ డిస్ప్లే. ఈ స్మార్ట్ వాచ్ లో 150 వాచ్ ఫేసెస్ సపోర్ట్, 100+ స్పోర్ట్ మోడ్స్ మరియు 30 డేస్ స్టాండ్ బై బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ రొటేటింగ్ ఫంక్షనల్ క్రౌన్ తో కూడా ఉంటుంది.

ఐటెల్ ఐకాన్-2 స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఐటెల్ వాచ్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో రూ. 1,000 రూపాయల బడ్జెట్ కేటగిరిలో నడుస్తున్న భారీ కాంపీటీషన్ కు తగిన ఫీచర్స్ మరియు ధరతో ఈ వాచ్ ను లాంఛ్ చేసింది ఐటెల్.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo