యాపిల్ ఇండియాలో Apple Watch Ultra, Series 8 మరియు SE లను విడుదల చేసింది.!
Apple ఐఫోన్ 14 సిరీస్ తో పాటుగా Apple Watch లను కూడా ప్రకటించింది
కొత్తగా Apple Watch Ultra, Series 8 మరియు SE లను ఇండియాలో విడుదల చేసింది
యాపిల్ వాచ్ అల్ట్రా కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలిగిన రగ్డ్ స్మార్ట్ వాచ్
యాపిల్ నిన్న నిర్వహించిన కార్యక్రమం నుండి ఐఫోన్ 14 సిరీస్ తో పాటుగా Apple Watch లను కూడా ప్రకటించింది. కొత్తగా Apple Watch Ultra, Series 8 మరియు SE లను ఇండియాలో విడుదల చేసింది. వీటిలో, యాపిల్ వాచ్ అల్ట్రా కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలిగిన రగ్డ్ స్మార్ట్ వాచ్. ఈ యాపిల్ వాచ్ ను టైటానియం బిల్డ్ మరియు సఫైర్ గ్లాస్ రక్షణలో ఉంచిన రెటీనా డిస్ప్లేతో అందించింది. భారత్ లో యాపిల్ ప్రవేశపట్టిన ఈ కొత్త యాపిల్ వాచ్ విశేషాలు ఏమిటో చూద్దాం పదండి.
SurveyApple Watch Ultra
ఇప్పటి వరకూ వచ్చిన యాపిల్ వాచ్ లలో ఇది అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగల మొదటిది అని యాపిల్ ఈ ఫోన్ గురించి చెబుతోంది. ఈ వాచ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS, టైటానియం కేస్ మరియు ప్రత్యేకమైన స్ట్రాప్స్ తో అన్ని రకాలైన అట్లెట్స్ మరియు అడ్వెంచరర్స్ కు అనువైనదని కూడా కంపెనీ చెబుతోంది. ఇది సాధారణ వాడకంతో 36 గంటల లైఫ్ టైం అందిస్తుంది. ఈ యాపిల్ వాచ్ -20 డిగ్రీల నుండి 55 డిగ్రీల వరకూ టెంపరేచర్ ను తట్టుకోగలదు. ఇందులో, టెంపరేచర్ సెన్సింగ్, ECG, స్లీప్ ట్రాకింగ్ మరియు బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ మోనిటరింగ్ వంటి చాల ఫీచర్లు వున్నాయి.
ఇలా చెప్పుకుంటూపోతే ఈ యాపిల్ వాచ్ అల్ట్రా గుట్టల కొద్దీ ఫీచర్లను తనలో ఇముడ్చుకుంది. ఈ యాపిల్ తన పేరు మరియు ఫీచర్లకు తగ్గట్టుగానే ధరను కూడా పలుకుతుంది. Apple Watch Ultra ను యాపిల్ రూ.89,900 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ యాపిల్ వాచ్ ఆర్డర్స్ మొదలయ్యాయి మరియు సెప్టెంబర్ 23 నుండి అందుబాటులోకి వస్తుంది.
Series 8 మరియు SE
ఇక యాపిల్ Series 8 మరియు SE స్మార్ట్ వాచ్ ల విషయానికి వస్తే, SE తక్కువ ధరలో వచ్చే వాచ్ కాగా వాచ్ సిరీస్ 8 మాత్రం బాగానే ధర పలుకుతుంది. ఈ రెండు యాపిల్ వాచ్ లు కూడా 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ప్లే తో వస్తాయి. వీటిలో, Series 8 బ్లడ్ ఆక్సిజన్, ECG మరియు టెంపరేచర్ సెన్సింగ్ లతో వస్తుంది. కానీ, SE స్మార్ట్ వాచ్ లో మాత్రం ఈ ఫీచర్లు ఉండవు. అయితే, సైకిల్ ట్రాకింగ్, SOS ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్ తో పటు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కాలింగ్ వంటి సౌకర్యాలు ఇతర రెండు ఫోన్ల మాదిరిగా కలిగి ఉంటుంది.
ఇక ఈ రెండు యాపిల్ వాచ్ ల ధరల విషయానికి వస్తే, Series 8 స్మార్ట్ వాచ్ ధర రూ.45,900 మరియు SE యాపిల్ వాచ్ ధర రూ. 29,900. ఈ రెండు యాపిల్ వాచ్ ఆర్డర్స్ మొదలయ్యాయి మరియు ఈ వాచ్ లు సెప్టెంబర్ 16 నుండి అందుబాటులోకి వస్తాయి.