Xiaomi X Pro QLED series నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసిన షియోమీ.!
Xiaomi X Pro QLED series స్మార్ట్ టీవీ లను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
ఈ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ టీవీలు షియోమీ ఈ రోజు విడుదల చేసింది
ఈ టీవీ లను మంచి సౌండ్, విజువల్స్ మరియు ఫీచర్స్ తో షియోమీ విడుదల చేసింది
SurveyXiaomi X Pro QLED series స్మార్ట్ టీవీ లను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలు షియోమీ ఈ రోజు విడుదల చేసింది. ఇందులో 43 ఇంచ్, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ టీవీ లను విడుదల చేసింది. ఈ టీవీ లను మంచి సౌండ్, విజువల్స్ మరియు ఫీచర్స్ తో షియోమీ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.
Xiaomi X Pro QLED series : ప్రైస్
షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ధర: రూ. 29,999
షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ధర: రూ. 44,999
షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ధర: రూ. 62,999
ఆఫర్స్
ఈ స్మార్ట్ టీవీ ఆపిన గొప్ప బ్యాంక్ ఆఫర్లు కూడా షియోమీ ప్రకటించింది. ఈ టీవీలను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లకు గరిష్టంగా రూ. 7,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఆగస్టు 30వ తేదీ నుంచి ఈ స్మార్ట్ టీవీలు సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ టీవీ లను Amazon, Flipkart, mi.com మరియు షియోమీ రిటైల్ స్టోరేజ్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
Your portal to a world of visual brilliance is here!
— Xiaomi TV India (@XiaomiTVIndia) August 27, 2024
Experience the future of television with the #XiaomiXProQLED Series which delivers unparalleled picture quality, immersing you in vibrant colours, stunning details, and infinite possibilities.
Starting at 29,999*. Sale starts… pic.twitter.com/YgmiojYWDv
Also Read: Vivo T3 Pro 5G: జస్ట్ ఇప్పుడే లాంచ్ అయిన వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
Xiaomi X Pro QLED series : ఫీచర్లు
షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ స్మార్ట్ టీవీలు అల్యూమినియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలు 4K HDR క్యూలెడ్ ప్యానల్ మరియు Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తాయని షియోమీ ప్రకటించింది. ఈ టీవీ MEMC రియాలిటీ ఫ్లో ఫీచర్ తో స్టన్నింగ్ విజువల్స్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీలో 32GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా షియోమీ జత చేసింది.

ఈ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ లలో HDMI 2.1, ALLM, HDMIArc, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ వుంది. ఈ టీవీ లు 30W సౌండ్ అందించే స్పీకర్లు కలిగి ఉంటాయి. ఈ టీవీ Dolby Audio, dts:X మరియు dts వర్చువల్ సపోర్ట్ తో వస్తాయి మరియు లీనమయ్యే గొప్ప సౌండ్ అందిస్తాయని షియోమీ తెలిపింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile