Mi TV 4A 40: జూన్ 1న షియోమి కొత్త స్మార్ట్ టీవీ లాంచ్
షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని ఇండియాలో విడుదల చేస్తోంది
ఇది చాలా సన్నని అంచులు కలిగిన "Horizon Display" తో వస్తుంది
ఈ షియోమి టీవీ 40 ఇంచ్ పరిమాణంలో వస్తుంది
షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని Mi TV 4A 40 పేరుతో లాంచ్ చేస్తోంది. ఈ టీవీ 40 ఇంచ్ పరిమాణంలో వస్తుంది మరియు ఇది చాలా సన్నని అంచులు కలిగిన "Horizon Display" తో వస్తుంది. ఈ హరిజోన్ డిస్ప్లే ఎడిషన్ నుండి ఇప్పటికే 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ సైజుల్లో రెండు స్మార్ట్ టీవీ లను అందించిన షియోమి, ఇప్పుడు 40 ఇంచ్ టీవీ ని విడుదల చేస్తోంది.
SurveyMi TV 4A 40: ప్రత్యేకతలు
ఇక ఈ Mi TV 4A 40 ప్రత్యేకతల విషయానికి వస్తే, కంపెనీ రీసెంట్ గా ప్రకటించిన QLED టీవీల కంటే చాలా సరసమైనవిగా ఉంటాయి. ఈ టీవీ గురించి అందించిన టీజర్ ఇమేజ్ నుండి ఈ టీవీ చాలా సన్నని అంచులతో ఉన్నట్లు ప్రకటించింది. మిగిలిన వివరాలు ఇంకా తెలియనప్పటికీ, ఈ సిరీస్ లో ముందుగానే వచ్చిన రెండు స్మార్ట్ టీవీల మాదిరిగానే మంచి స్పెక్స్ తో ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇక ఈ టీవీ ఎటువంటి ధరలో ప్రకటించవచ్చు? అని కూడా టెక్ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుత టీవీ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని షియోమి లాంచ్ చేయబోయే ఈ కొత్త స్మార్ట్ టీవీ ధరను రూ.20,000 నుండి రూ.25,000 రూపాయల ధర పరిధిలో ఉంచవచ్చని ఊహిస్తున్నారు. ఈ Mi TV 4A 40 మంచి సౌండ్ మరియు పిక్చర్ క్వాలిటీ అందించే ఫీచర్లతో వుంటుందని కూడా అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile