Xiaomi S Mini LED సిరీస్ నుండి కొత్త Smart Tv లాంచ్: ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Xiaomi S Mini LED సిరీస్ నుండి కొత్త Smart Tv లాంచ్ చేసింది
గొప్ప బ్రైట్నెస్ మరియు గరిష్టంగా 512 లోకల్ డిమ్మింగ్ జోన్స్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది
ఈ టీవీలు క్వాడ్ స్పీకర్ సిస్టం కలిగి టోటల్ 34W సౌండ్ ఆఫర్ చేస్తాయి
Xiaomi S Mini LED సిరీస్ నుండి కొత్త Smart Tv లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీని గొప్ప బ్రైట్నెస్ మరియు గరిష్టంగా 512 లోకల్ డిమ్మింగ్ జోన్స్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఇందులో డిస్ప్లే తో పాటు సౌండ్ కోసం కూడా మంచి సెటప్ అందించింది. షియోమీ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyXiaomi S Mini LED Smart Tv : ప్రైస్
షియోమీ ఈ స్మార్ట్ టీవీని మొత్తం మూడు సైజుల్లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు లిస్ట్ ఇక్కడ అందించాము.
- ఎస్ మినీ LED స్మార్ట్ టీవీ (55 ఇంచ్) ప్రైస్: రూ. 51,999
- ఎస్ మినీ LED స్మార్ట్ టీవీ (65 ఇంచ్) ప్రైస్: రూ. 71,999
- ఎస్ మినీ LED స్మార్ట్ టీవీ (75 ఇంచ్) ప్రైస్: రూ. 99,999
ఈ మూడు స్మార్ట్ టీవీలు అమెజాన్ మరియు కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి లిస్ట్ చేసింది. అయితే, ప్రస్తుతం ముందస్తు బుకింగ్ కోసం మాత్రమే ఈ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ స్మార్ట్ టీవీలు సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
Xiaomi S Mini LED Smart Tv : ఫీచర్స్
ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా ఒకే విధమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. కేవలం స్క్రీన్ సైజులో మాత్రమే మార్పులు కలిగి ఉంటాయి. ఈ టీవీలు ప్రీమియం మెటాలిక్ ఫినిష్ డిజైన్ తో ఆకట్టుకుంటాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలు మినీ LED ప్రెసిషన్ క్వాంటం డాట్ టెక్నాలజీ స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ టీవీ డిస్ప్లేలు గరిష్టంగా 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 512 లోకల్ డిమ్మింగ్ జోన్స్ తో ఆకట్టుకునే రంగులు మరియు గొప్ప బ్రైట్నెస్ అందిస్తాయి.

ఈ టీవీలు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz (DLG 120 Hz) రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10+, HLG మరియు AI పిక్చర్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఈ టీవీలు క్వాడ్ స్పీకర్ సిస్టం కలిగి టోటల్ 34W సౌండ్ ఆఫర్ చేస్తాయి. ఈ టీవీలు డాల్బీ ఆడియో, DTS – X మరియు DTS Virtual : X సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. అయితే, ఈ టీవీలు eARC (Dolby Atmos Pass-through) సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇందులో 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టవిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile