Amazon Great Indian Festival 2026 సేల్ డేట్ అనౌన్స్ చేసింది.. సేల్ ఆఫర్స్ తో టీజర్ పేజీ రివీల్.!
Amazon Great Indian Festival 2026 సేల్ డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందించింది
పండుగ సేల్ డేట్ తో పాటు ఈ సేల్ నుంచి అందించనున్న బిగ్ డీల్స్ తో టీజర్ పేజీని రివీల్ చేసింది
జబర్దస్త్ ఆఫర్స్ మరియు డీల్స్ ని యూజర్లు పొందవచ్చని అమెజాన్ టీజింగ్
Amazon Great Indian Festival 2026 సేల్ డేట్ కోసం ఎదురుచూస్తున్నా అమెజాన్ ఫాన్స్ కోసం ఈరోజు గుడ్ న్యూస్ అందించింది. అమెజాన్ ఇండియా ఈ రోజు ఈ అప్ కమింగ్ పండుగ సేల్ డేట్ తో పాటు ఈ సేల్ నుంచి అందించనున్న బిగ్ డీల్స్ తో టీజర్ పేజీని కూడా రివీల్ చేసింది. 2026 దసరా పండుగ సందర్భంగా అమెజాన్ ప్రకటించిన ఈ సేల్ నుంచి జబర్దస్త్ ఆఫర్స్ మరియు డీల్స్ ని యూజర్లు పొందవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
SurveyAmazon Great Indian Festival 2026
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్, అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ సేల్ డేట్ తో పాటు ఈ సేల్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ మరియు ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీతో వివరాలు అందించింది. ఈ ప్రత్యేకమైన పేజీ నుంచి అక్టోబర్ 8 నుంచి మొదలుకానున్న ఈ అప్ కమింగ్ సేల్ ద్వారా అందించనున్న బిగ్ డీల్స్ ని టీజింగ్ కూడా చేసింది.
Amazon Great Indian Festival 2026 : డీల్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్, బ్లూటూత్ స్పీకర్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఏసీలు మరియు ఫ్యాషన్ తో సహా చాలా వస్తువులు మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. అలాగే, ఈ సేల్ కోసం HDFC బ్యాంక్ ను సాల్ పార్టనర్ గా అనౌన్స్ చేసింది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో వస్తువులు కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఈ సేల్ నుంచి అదనపు ఎక్స్ చేంజ్ బోనస్, నో కాస్ట్ EMI, కూపన్ డిస్కౌంట్ మరియు అమెజాన్ అప్ గ్రేడ్ వంటి అదనపు డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఓవరాల్ గా ఈ అన్ని ఆఫర్స్ తో ఈ సేల్ నుంచి గొప్ప ఆఫర్ ధరలో వస్తువులు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
ప్రస్తుతం, ఈ అప్ కమింగ్ సేల్ టీజర్ పేజీలో మొబైల్ ఫోన్ డీల్స్ ను ముఖ్యంగా లిస్ట్ చేసింది. ఇందులో, అల్ట్రా ప్రీమియం మొబైల్ విభాగంలో ఐకూ 15R, వన్ ప్లస్15R, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మరియు వివో వి 70 వంటి లేటెస్ట్ ఫోన్స్ లిస్ట్ చేసింది. మిడ్ రేంజ్ ఫోన్ లిస్ట్ లో వన్ ప్లస్ ఎన్ 6, గెలాక్సీ M47, రెడ్ మీ నోట్ 17, రియల్ మీ నార్జో 100x మరియు ఐకూ Z11xa వంటి ఫోన్లను అందించింది.
Also Read: LG 55 Nano Smart Tv పై సేల్ కంటే ముందే బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
ఇదే కాదు ఈ అప్ కమింగ్ అమెజాన్ బిగ్ సేల్ నుంచి నార్డ్ బడ్స్ 4 ప్రో, రియల్ మీ టి 310, ఒప్పో ఎయిర్ 5 మరియు శాంసంగ్ బడ్స్ కోర్ వంటి లేటెస్ట్ బడ్స్ ని కూడా మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
