todays best 55 QLED Smart Tv available on amazon
55 QLED Smart Tv: ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ టీవీలు మంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో చాలా రీజనబుల్ ప్రైస్ లో లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీ మార్కెట్ లో పెరిగిన ఒత్తిడి మరియు మార్కెట్ లో పెరిగిన పోటీ తత్వం వెరసి స్మార్ట్ టీవీ ధరలపై బాగా ప్రభావం చూపించాయి. సాధారణంగా సేల్ సమయంలో స్మార్ట్ టీవీలపై గొప్ప ఆఫర్లు లభిస్తాయి. అయితే, ఈ రోజు కూడా ఒక లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ టీవీ బెస్ట్ ప్రైస్ లో సేల్ అవుతోంది.
2024 లో ఆవిర్భవించిన భారత స్మార్ట్ టీవీ కంపెనీ Lumio రీసెంట్ గా అందించిన హైఎండ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Vision 7 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రీసెంట్ సేల్ నుంచి రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ సేల్ నుంచి అమ్ముడైంది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా ఈ స్మార్ట్ టీవీని రూ. 42,999 ధరతో సేల్ చేస్తోంది.
రేటు పెరిగితే మంచి డీల్ అంటారు ఏమిటి, అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా, ఈరోజు అమెజాన్ ఈ స్మార్ట్ టీవీపై అందించిన భారీ బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో లభిస్తుంది. అదేమిటంటే, అమెజాన్ ఈ స్మార్ట్ టీవీపై HSBC Taj Credit రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 39,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. అలాగే, ఈ టీవీపై SBI క్రెడిట్ కార్డు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. Buy From Here
Also Read: ఒకప్పుడు Cyber Cafe ఇప్పుడు Smartphone: తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ లైఫ్ ఎలా మారింది.!
ఈ లూమియో స్మార్ట్ టీవీ భారత వినియోగదారుల కోసం తగిన అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ వేగవంతమైన BOSS ప్రాసెసర్, 3GB LPDDR ర్యామ్ మరియు ఫాస్ట్ రెస్పాన్స్ 64GB హెవీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 55 ఇంచ్ క్యూలెడ్ డిస్ప్లేని 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, HDR 10 మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీలో యూట్యూబ్ వీడియోలను 60fps 4k రిజల్యూషన్ లో ఎంజాయ్ చేయవచ్చు.
ఇక సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఈ టీవిలో రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు రెండు ట్వీటర్ లతో మొత్తం క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఈ సెటప్ తో ఈ టీవీ టోటల్ 30w అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ అట్మోస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, 3 HDMI పోర్ట్, 3 USB పోర్ట్, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 40 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఈ టీవీ గొప్ప ఫీచర్స్ కలిగిన బెస్ట్ స్మార్ట్ టీవీలలో ఒకటిగా ఉంటుంది.