ఈరోజు లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ పై ఒక లుక్కేద్దామా.!
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ జూన్ ఎపిక్ సేల్ నుంచి బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది
Dolby Atmos వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది
ఈ టీవీ కొత్త Max Ai క్వాడ్ కోర్ చిప్ సెట్ జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ తో వస్తుంది
కొత్త స్మార్ టీవీ కోసం చాలా రోజులుగా ఆన్లైన్ లో సెర్చ్ చేసినా సరైన డీల్ లభించ లేదా? అయితే, మీకు మేము సహాయం చేస్తాము. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ జూన్ ఎపిక్ సేల్ నుంచి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2025 లో విడుదలైన లేటెస్ట్ మోడల్ మరియు Dolby Atmos వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
SurveyQLED Smart Tv : ఆఫర్
ప్రముఖ బడ్జెట్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak Matrix సిరీస్ నుంచి ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ టీవీ 33% డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 30,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని బ్యాంక్ అఫ్ బరోడా (BOB) క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 2,150 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ బిగ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 28,849 ఆఫర్ ధరలో లభిస్తుంది.
Kodak QLED Smart Tv : ఫీచర్స్
ఈ కోడాక్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ క్యూలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ HDR 10, 550 నిట్స్ బ్రైట్నెస్ మరియు డైనమిక్ క్రిస్టల్ కలర్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ కొత్త Max Ai క్వాడ్ కోర్ చిప్ సెట్ జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ మంచి స్లీక్ అండ్ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ టీవీ కాదు`క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి టోటల్ 60W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో మంచి ఫీల్ ఇచ్చే సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ OS ఫై నడుస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ వంటి అన్ని OTT యాప్స్ కీ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, HDMI, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: కేవలం 5 వేల బడ్జెట్ లోనే లేటెస్ట్ పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ బార్ పొందండి.!
ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రెయిన్ మరియు సౌండ్ పరంగా మంచి రివ్యూలు అందుకుంది. ఈ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
