కేవలం 5 వేల బడ్జెట్ లోనే లేటెస్ట్ పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ బార్ పొందండి.!
ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న జూన్ ఎపిక్ సేల్ వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది
హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ధరలు ప్రకటించింది
Dolby Audio సపోర్ట్ తో కూడిన ఒక లేటెస్ట్ పవర్‌ఫుల్ సౌండ్ బార్ అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది
ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న జూన్ ఎపిక్ సేల్ వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు, సౌండ్ బార్లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ధరలు ప్రకటించడంతో యూజర్లు మంచి ఆసక్తి చూపుతున్నారు. ఈ సేల్ లో భాగంగా Dolby Audio సపోర్ట్ తో కూడిన ఒక లేటెస్ట్ పవర్‌ఫుల్ సౌండ్ బార్ అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఈ సౌండ్ బార్ డీల్ గురించి చూద్దాం.
SurveyDolby Audio సౌండ్ బార్ : ఆఫర్
ZEBRONICS 2026 లో లేటెస్ట్ గా విడుదల చేసిన 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరతో లిస్ అయ్యింది. అలాగే, ఈ సౌండ్ బార్ పై HSBC మరియు BOB క్రెడిట్ ఆప్షన్ పై రూ. 600 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,399 బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Dolby Audio సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ లేటెస్ట్ గా విడుదలైన 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ మంచి ప్రీమియం అండ్ కాంపాక్ట్ డిజైన్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ చాలా కాంపాక్ట్ సైజులో ఉండే బార్ తో వస్తుంది మరియు ఇందులో 30W సౌండ్ అందించే రెండు స్పీకర్ల ట్వీటర్ ఉంటుంది. పవర్ ఫుల్ అండ్ డీప్ బాస్ సౌండ్ అందించే 80W డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ ఈ సౌండ్ బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ గా 140W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 2.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు వర్చువల్ సరౌండ్ సౌండ్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వాల్ మౌంట్ ఫీచర్ మరియు మంచి బ్రైట్ LED డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది. ఇందులో మీడియా మరియు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో జతగా వస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఆప్టికల్, USB, AUX, HDMI Arc మరియు బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: NEET UG Admit Card: రీ ఎగ్జామ్ హాల్ టికెట్ ను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. 5 వేల రూపాయల బడ్జెట్ లో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
