NEET UG Admit Card: రీ ఎగ్జామ్ హాల్ టికెట్‌ ను ఇలా డౌన్‌ లోడ్ చేసుకోండి.!

HIGHLIGHTS

నీట్ UG 2026 రీ ఎగ్జామ్‌ కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుభవార్త అందించింది

నీట్ UG రీ ఎగ్జామినేషన్ కోసం అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌ సైట్‌ లో రిలీజ్ చేసింది

అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఇప్పుడు ఆన్‌ లైన్‌ లో డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు

NEET UG Admit Card: రీ ఎగ్జామ్ హాల్ టికెట్‌ ను ఇలా డౌన్‌ లోడ్ చేసుకోండి.!

NEET UG Admit Card: నీట్ UG 2026 రీ ఎగ్జామ్‌ కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుభవార్త అందించింది. జూన్ 21, 2026 న జరగనున్న నీట్ UG రీ ఎగ్జామినేషన్ కోసం అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌ సైట్‌ లో రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఇప్పుడు ఆన్‌ లైన్‌ లో డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

NEET UG 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడు?

NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం NEET UG 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది.

NEET UG Admit Card: ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక NEET వెబ్‌ సైట్‌ neet.nta.nic.in ద్వారా తమ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింద సూచించిన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • అప్లికేషన్ నెంబర్
  • పాస్వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్
  • నమోదిత మొబైల్ నంబర్ (అవసరమైతే)

ఈ వివరాలు దగ్గర పెట్టుకుని అధికారిక NEET వెబ్‌ సైట్‌ ను సందర్శించండి. హోమ్‌పేజీలో కనిపించే “NEET UG 2026 Re-Examination Admit Card” లింక్‌ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ లేదా / ఆఫ్ బర్త్ నమోదు చేయండి. తర్వాత Submit బటన్‌ పై క్లిక్ చేయండి. అంతే, మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ హాల్ టికెట్‌ ను PDF రూపంలో డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ ను కనీసం 2-3 ప్రింట్ కాపీలు తీసుకోవడం మంచిది.

NEET UG Admit Card

మీ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయండం చాలా ముఖ్యమైన విషయంగా గుర్తుపెట్టుకోండి.

Also Read: SONY 5.1 Dolby సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ జూన్ ఎపిక్ సేల్ బిగ్ డీల్ అందుకోండి.!

అడ్మిట్ కార్డు లో చెక్ చేయాల్సిన వివరాలు

హాల్ టికెట్ డౌన్‌ లోడ్ చేసిన వెంటనే ఈ క్రింద తెలిపిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి.

  • అభ్యర్థి పేరు
  • రోల్ నంబర్
  • అప్లికేషన్ నంబర్
  • ఫోటో మరియు సంతకం
  • పరీక్షా కేంద్రం పేరు
  • పరీక్షా కేంద్రం పూర్తి చిరునామా
  • రిపోర్టింగ్ టైమ్
  • పరీక్ష తేదీ

ఒకవేళ పైన తెలిపిన వివరాలలో ఏదైనా తప్పులు ఉంటే, వెంటనే NTA హెల్ప్‌ డెస్క్‌ ను సంప్రదించాలి. NEET UG 2026 రీ ఎగ్జామ్‌ కు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను వెంటనే డౌన్‌ లోడ్ చేసుకుని అందులోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పరీక్ష రోజున అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile