Sony Smart Tv: సోనీ రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది.. ఫీచర్లే కాదు రేటు కూడా అదరహో..

Sony Smart Tv: సోనీ రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది.. ఫీచర్లే కాదు రేటు కూడా అదరహో..
HIGHLIGHTS

Sony కంపెనీ రెండు 4K స్మార్ట్ టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది

ఈ టీవీలను 77-ఇంచ్ మరియు 85-ఇంచ్ టూ భారీ సైజుతో తీసుకొచ్చింది

కొత్త ప్రాసెసర్ మరియు బెస్ట్ సౌండ్ టెక్నాలజీని అందించింది

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Sony కంపెనీ రెండు 4K స్మార్ట్ టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రెండు 4K స్మార్ట్ టీవీలను కూడా అత్యంత ఉన్నతమైన ఫీచర్లతో చాలా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. ఈ టీవీలను 77-ఇంచ్ మరియు 85-ఇంచ్ టూ భారీ సైజుతో తీసుకొచ్చింది. ఈ రెండు టీవీలలో కూడా లేటెస్ట్ కొత్త ప్రాసెసర్ మరియు బెస్ట్ సౌండ్ టెక్నాలజీని అందించింది. ఈ రెండు టీవీలు ప్రైస్ పరంగా కూడా చాలా ప్రీమియం ధరతో వచ్చాయి. కొత్తగా వచ్చిన ఈ రెండు Sony స్మార్ట్ టీవీల ప్రైస్ మరియు ప్రత్యేకతలను తెలుసుకుందాం.

సోనీ కంపెనీ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ టీవీలను Bravia XR-77A80J మరియు KD-85X85J మోడల్ నంబర్లతో ప్రకటించింది. వీటిలో Bravia XR-77A80J టీవీ 77 ఇంచ్ సైజుతో రూ.5,49, 990 రూపాయల ధరతో ప్రకటించగా KD-85X85J మోడల్ 85 ఇంచ్ సైజుతో రూ.4,99, 990 రూపాయల ధరతో ప్రకటించింది. ఆగష్టు 16 తేదీ లోపు ప్రీ-బుకింగ్ చేసుకునేవారికి 20,000 రూపాయల క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. అయితే, ఈ అఫర్ కేవలం సెలక్టెడ్ కార్డ్స్ పైన మాత్రమే వర్తిస్తుంది.

ఇక రెండు టీవీల ప్రత్యేకతల విషయానికి వస్తే, XR-77A80J మోడల్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన OLED డిస్ప్లే తో వస్తుంది. ఈ టీవీ Cognitive ప్రాసెసర్ XR పిక్చర్ ఇంజిన్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ టీవీ. ఇది Dolby Vision, HDR 10, HLG  కి సపోర్ట్ చేస్తుంది మరియు మునుపెన్నడూ చూడనటువంటి స్వచ్ఛమైన కలర్స్ ఈ టీవీలో చూడవచ్చని సోనీ పేర్కొంది. అంతేకాదు, ఇది Dolby Atmos, DTS సరౌండ్ మరియు Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ OS పైన పనిచేస్తుంది మరియు లేటెస్ట్ HDMI 2.1 పోర్ట్స్ కలిగి వుంది.  

అయితే, KD-85X85J మోడల్ 4K రిజల్యూషన్ కలిగిన LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ టీవీ కూడా Dolby Vision, HDR 10, HLG  కి సపోర్ట్ చేస్తుంది మరియు Dolby Atmos, DTS సరౌండ్ మరియు Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo