కొత్త QLED 4K Smart Tv లను విడుదల చేసిన Samsung.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

కొత్త QLED 4K Smart Tv లను విడుదల చేసిన Samsung.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
HIGHLIGHTS

శామ్సంగ్ ఇండియన్ మార్కెట్లో కొత్త 2024 QLED 4K Smart Tv లను విడుదల చేసింది

ఈ కొత్త టీవీలను ప్రీమియం ఫీచర్స్ తో విడుదల చేసింది

ఈ స్మార్ట్ టీవీ చాలా స్లీక్ గా వుండే ఎయిర్ స్లిమ్ డిజైతో కూడా ఆకట్టుకుంటుంది

శామ్సంగ్ ఇండియన్ మార్కెట్లో కొత్త 2024 QLED 4K Smart Tv లను విడుదల చేసింది. ఈ కొత్త టీవీలను ప్రీమియం ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ కొత్త టీవీలు చాలా తక్కువ అంచులు మరియు స్లీక్ డిజైన్ తో తీసుకు వచ్చినట్లు శామ్సంగ్ తెలిపింది. శామ్సంగ్ సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ఈ లేటెస్ట్ క్యూలెడ్ 4K స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Samsung QLED 4K Smart Tv: ప్రైస్ 

శామ్సంగ్ లేటెస్ట్ క్యూలెడ్ 4K స్మార్ట్ టీవీ లైనప్ ను రూ. 65,990 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ కొత్త 2024 లేటెస్ట్ క్యూలెడ్ 4K స్మార్ట్ టీవీ సిరీస్ లో 55, 65 మరియు 75 ఇంచ్ టీవీ లను అందించింది. ఈ స్మార్ట్ టీవీలు అమెజాన్ మరియు శామ్సంగ్ అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. Buy From Here            

Samsung QLED 4K Smart Tv: ఫీచర్లు

ఈ శామ్సంగ్ క్యూలెడ్ 4K స్మార్ట్ టీవీలు క్వాంటమ్ ప్రోసెసర్ లైట్ 4K  మరియు క్వాంటమ్ HDR తో 10% కలర్ యాక్యురసీ తో విజువల్స్ అందిస్తాయని శామ్సంగ్ తెలిపింది. ఈ టీవీ లో అంచులు చాలా సన్నగా ఉంటాయి మరియు పూర్తిగా డిస్ప్లే కనిపించేలా డిజైన్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ చాలా స్లీక్ గా వుండే ఎయిర్ స్లిమ్ డిజైతో కూడా ఆకట్టుకుంటుంది. ఇది డ్యూయల్ LED, సుప్రీమ్ UHD డిమ్మింగ్, కాంట్రాస్ట్ ఎన్హెన్సర్, 4K అప్ స్కేలింగ్ మరియు ఫిల్మ్ మేకర్ మోడ్ వంటి ఫీచర్ ను కూడా కలిగి వుంది.

Samsung QLED 4K Smart Tv
Samsung QLED 4K Smart Tv

ఈ టీవీ 3HDMI, 2 USB-A పోర్ట్స్, WiFi, బ్లూటూత్, ఎనీ నెట్ ప్లస్ (HDMI Cec), LAN పోర్ట్, ఆప్టికల్ మరియు RF ఇన్ పోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇందులో, Bixby, వెబ్ బ్రౌజర్, స్మార్ట్ థింగ్స్ హబ్, IoT సెన్సార్ ఫంక్షనాలిటీ, మొబైల్ టూ టీవీ మిర్రరింగ్, వైర్లెస్ టీవీ ఆన్ సౌండ్ మరియు మిర్రరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Aadhaar Card లో మీ పాత ఫోటో స్థానంలోకొత్త ఫోటో అప్డేట్ చెయ్యాలా.!

ఆడియో పరంగా కూడా ఈ టీవీ లో గొప్ప ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 20W Output- 2CH సెటప్ తో వస్తుంది. అలాగే, లీనమయ్యే సౌండ్  అందించడానికి OTS లైట్ పవర్ ఫుల్ స్పీకర్, అడాప్టివ్ సౌండ్ మరియు Q సింఫనీ సౌండ్ టెక్నాలజీ లను కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీ 3D సౌండ్ అనుభూతిని అందిస్తుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo