Aadhaar Card లో మీ పాత ఫోటో స్థానంలోకొత్త ఫోటో అప్డేట్ చెయ్యాలా.!

Aadhaar Card లో మీ పాత ఫోటో స్థానంలోకొత్త ఫోటో అప్డేట్ చెయ్యాలా.!
HIGHLIGHTS

అత్యున్నత ఐడెంటిఫికేషన్ పత్రంగా ఆధార్ ప్రథమ స్థానంలో ఉంటుంది

మీ ఆధార్ పాత ఫోటో స్థానంలో లేటెస్ట్ ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు

ఎటువంటి అదనపు డాక్యుమెంట్లు కూడా అవసరం ఉండదు

Aadhaar Card: దేశంలో అత్యున్నత ఐడెంటిఫికేషన్ పత్రంగా ఆధార్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ప్రభుత్వ పథకాలకి అర్హత పొందాలన్నా లేదా ఏదైనా ఇతర పనులకు కూడా ఆధార్ కార్డునే ముందుగా అడుగుతారు. అటువంటి ఆధార్ కార్డులో గుర్తించలేని విధంగా మీ పాత ఫోటో ఉన్నట్లయితే, మీరు దాని స్థానంలో లేటెస్ట్ ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనికోసం ఆన్లైన్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సబ్ మీట్ చేస్తే సరిపోతుంది.                            

Aadhaar Card లో కొత్త ఫోటోని ఎలా అప్డేట్ చెయ్యాలి?

ఆధార్ కార్డులో కొత్త ఫోటోని అప్డేట్ చేయడానికి మీరు మీ UIDAI వెబ్సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ / కరెక్షన్ / అప్డేట్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ అప్డేట్ అప్లికేషన్ ను సరైన వివరాలతో పూరించాలి. ఈ పూరించిన అప్లికేషన్ ను దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి అక్కడ అందించాలి.

ఆధార్ కేంద్రంలో మీ ఆధార్ అప్లికేషన్ ను పరిశీలించి మీ ఆధార్ అప్డేట్ ను నిర్వహిస్తారు. ఇక్కడ మీ బయోమెట్రిక్ తో కొత్త ఫోటోను తీసుకుంటారు. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఎటువంటి కొత్త ఫోటోలు అందించవలసిన అవసరం కూడా ఉండదు. అలాగే, మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే సరిపోతుంది మరియు దీనికోసం ఎటువంటి అదనపు డాక్యుమెంట్లు కూడా అవసరం ఉండదు.

Aadhaar Card
Aadhaar Card

మీరు మీ లేటెస్ట్ ఫోటోతో ఆధార్ ను అప్డేట్ చేసుకున్న తర్వాత 90 రోజుల లోపల మీ కొత్త ఆధార్ కార్డు అప్డేట్ చేయబడుతుంది. అంతే, మీరు మీ కొత్త ఫోటో తో వచ్చిన లేటెస్ట్ ఆధార్ కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. మీ కొత్త ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు UIDAI వెబ్సైట్ నుండి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

దీనికోసం, UIDAI అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఆధార్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ‘నా ఆధార్’ ట్యాబ్ లోకి వెళ్లి ‘ఆధార్ ను డౌన్లోడ్ చేసుకోండి’ పైన నొక్కండి. ఇక్కడ ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి OTP కోసం రిక్వెస్ట్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు అందుకున్న OTP తో మీ కొత్త ఆధార్ ను డౌన్లోడ్ చేసుకోండి.

Also Read: 3D Calling టెక్నాలజీ తీసుకొచ్చిన నోకియా.. మొదటి కాల్ చేసిన Nokia CEO.!                     

మరొక ముఖ్యమైన ఆధార్ అప్డేట్ ను ఈరోజు గుర్తు చేసుకుందాం. 10 సంవత్సరాలు గడిచిన ఆధార్ కార్డు హోల్డర్స్ వారి లేటెస్ట్ డాక్యుమెంట్స్ తో వారి ఆధార్ ని అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీనికోసమే ఆధార్ అప్డేట్ కోసం వసూలు చేసే ఛార్జ్ ని తీసేసి ఉచితంగా అప్డేట్ చేసుకునే వెసులుబాటును కూడా అందించింది. అయితే, ఈ ఉచిత ఆధార్ సౌలభ్యం అప్డేట్ జూన్ 14వ తేదీతో ముగుస్తుంది.

ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు నిండిన వారు ఈ ఉచిత ఆధార్ అప్డేట్ ఆప్షన్ ద్వారా వారి ఆధార్ ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఉచిత ఆధార్ అప్డేట్ కు కేవలం 3 రోజుల గడువు మాత్రమే ఉందని గుర్తుంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo