Lava Bold 2 5G : ఫస్ట్ సేల్ ఆఫర్స్ తో సేల్ స్టార్ట్ అవుతోంది.!

HIGHLIGHTS

లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ చాలా సరసమైన ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ కేవలం 7.55mm మందంతో అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ఉంటుంది

Lava Bold 2 5G : ఫస్ట్ సేల్ ఆఫర్స్ తో సేల్ స్టార్ట్ అవుతోంది.!

Lava Bold 2 5G: లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా సరసమైన ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది మరియు మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Bold 2 5G : ధర

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ను రూ. 12,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ తో ఉంటుంది. ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ఫోన్ మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది. ఈ లావా న్యూ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. ఫెదర్ వైట్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ రెండు కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Also Read: Ugadi 2026: తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మరియు ఇమేజస్ ప్రత్యేకంగా మీకోసం.!

Lava Bold 2 5G : ఫీచర్స్

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ కేవలం 7.55mm మందంతో అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ 5 లక్షల ప్లస్ AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7060 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో 6 జీబీ LPDDR5 ఫిజికల్ ర్యామ్ జతగా 6 జీబీ వర్చువల్ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కాలంగా ఉంటుంది. ఈ లేటెస్ట్ లావా ఫోన్ బ్లోట్ వేర్ లేకుండా ఉంటుంది.

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Ai డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు టైప్ C పోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా IP64 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo