వన్ ప్లస్ బడ్జెట్ పెద్ద టీవీ సేల్ ఈరోజు నుండి స్టార్ట్

HIGHLIGHTS

వన్ ప్లస్ పెద్ద టీవీని బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది

OnePlus 40Y1 సేల్ ఈరోజు నుండి స్టార్ట్ అయ్యింది

OnePlus 40Y1 స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.21,999 మాత్రమే

వన్ ప్లస్ బడ్జెట్ పెద్ద టీవీ సేల్ ఈరోజు నుండి స్టార్ట్

వన్ ప్లస్ పెద్ద టీవీని బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది. వన్ ప్లస్ Y సిరీస్ నుండి ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని వన్ ప్లస్ విడుదల చేసింది.  ఈ సిరీస్ నుండి ముందుగానే 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు అందుబాటులో వున్నాయి. అయితే, Oneplus Y సిరీస్ నుండి ఈ కొత్త స్మార్ట్ టీవీని OnePlus 40Y1 మోడల్ నంబర్ తో 40 ఇంచ్ సైజులో విడుదల చేసింది. OnePlus 40Y1 స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ మరియు 20W పెద్ద సౌండ్ తో పాటుగా చాలా ఫీచర్లతో వస్తుంది. ఈ OnePlus 40Y1 స్మార్ట్ టీవీని కేవలం రూ.21,999 రూపాయల ధరకే ప్రకటించింది మరియు ఈ స్మార్ట్ టీవీ యొక్క సేల్ ఈరోజు స్టార్ట్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 40Y1: ప్రత్యేకతలు

ఈ OnePlus 40Y1 స్మార్ట్ టీవీ 1980×1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వుంటుంది. అంటే, ఇది FHD స్మార్ట్ టీవీ అన్నమాట. ఈ వన్ ప్లస్ కొత్త టీవీ వైడ్ కలర్ గ్యాముట్ తో వస్తుంది. ఇది వన్ ప్లస్ ఆక్సిజన్ ప్లే UI మరియు ఆండ్రాయిడ్ టీవీ UI తో కూడా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 తో పనిచేస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్ తో వుంటుంది. ఈ టీవిలో ప్లే స్టోర్ నుండి వేల యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రైమ్ వీడియో , Netflix, Hotstar వంటి అన్ని పాపులర్ యాప్స్ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ టీవీ తక్కువ అంచులు కలిగి ఎక్కువ స్క్రీన్ ఏరియాతో వుంటుంది. అంటే, చాలా సన్నని అంచులను కలిగి ఉంటుంది. ఇది 20W డాల్బీ ఆడియో సౌండ్ అందించ గల బాక్స్ స్పీకర్లను కలిగి వుంటుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ కనెక్టివిటీ పరంగా ,WiFi, 2 HDMI, 2USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వుంది. Flipakrt లో లిస్ట్ చెయ్యబడిన ఈ వన్ ప్లస్ కొత్త టీవీ మే 26 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకాలను సాగిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo