Mi TV 6 టీవీ 48MP కెమెరా 100W హెవీ సౌండ్ టెక్నాలజీతో వచ్చింది

Mi TV 6 టీవీ 48MP కెమెరా 100W హెవీ సౌండ్ టెక్నాలజీతో వచ్చింది
HIGHLIGHTS

షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ టీవీ Mi TV 6 ని ప్రకటించింది

Mi TV లో 48MP డ్యూయల్ కెమెరా సెటప్

ఈ టీవీ లో 100 W హెవీ సౌండ్ కూడా అందుతుంది

షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ టీవీ Mi TV 6 ని ప్రకటించింది. Mi TV 6 స్మార్ట్ టీవీ లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెటీలో విడుదల చేసింది. ఈ Mi TV 6 స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్ మాదిరిగా కెమెరా సిస్టమ్ ను కలిగి ఉంటుంది. అదీకూడా 48MP డ్యూయల్ కెమెరా సెటప్ తో ఉంది. ఇది మాత్రమే కాదు ఈ షియోమి స్మార్ట్ టీవీ చాలా లేటెస్ట్ ఫీచర్లతో ఆకుట్టుకుంటోంది.  మరి ఇన్ని ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ Mi TV 6 స్మార్ట్ టీవీ ప్రత్యేకతల గురించి పూర్తిగా తెలుసుకుందామా..!      

Mi TV 6 స్మార్ట్ టీవీ

లేటెస్ట్ గా చైనాలో విడుదలైన ఈ షియోమి స్మార్ట్ టీవీ Mi TV 6 అమోఘమైన ఫీచర్లతో వచ్చింది. Mi TV 6 స్మార్ట్ టీవీ QHD రిజల్యూషన్ తో వుంటుంది. అంతేకాదు, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K డిస్ప్లే ని కలిగి ఉంటుంది.  ఈ షియోమి లేటెస్ట్ స్మార్ట్ టీవీ 4.5 GB ర్యామ్ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి మీడియా టెక్ 8KTV పవర్ ఫుల్ ప్రొసెసర్ తో వస్తుంది.

ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ DTS-X మరియు Dolby Atmos రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లో 100 W హెవీ సౌండ్ కూడా అందుతుంది. అంటే, విడిగా ఎటువంటి హోమ్ థియేటర్ సిస్టం అవసరం లేకుండా Deep Bass మరియు హెవీ సౌండ్ ని కూడా ఆస్వాదించవచ్చు.   

ఈ షియోమి టీవీలో మీకు మల్టి కనెక్టివిటీ లభిస్తుంది. ఇందులో, WiFi 6 సపోర్ట్ , HDMI 2.0 మరియు eARC తో పాటుగా 2USB పోర్ట్స్  కూడా ఉన్నాయి. ఇది Android మరియు PatchWall OS తో  పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo