LG New OLED: మొట్టమొదటి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీ లాంచ్: రేటు చూస్తే కళ్ళు తిరుగుతాయి.!

HIGHLIGHTS

LG బ్రాండ్ నుంచి కొత్త OLED మార్కెట్లో విడుదల చేయబడింది

ఇది ప్రపంచపు మొట్టమొదటి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీ

ఈ టీవీని ముందుగా CES 2024 ఈవెంట్ లో LG పరిచయం చేసింది

LG New OLED: మొట్టమొదటి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీ లాంచ్: రేటు చూస్తే కళ్ళు తిరుగుతాయి.!

LG New OLED: LG బ్రాండ్ నుంచి కొత్త OLED మార్కెట్లో విడుదల చేయబడింది. ఇది ప్రపంచపు మొట్టమొదటి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీ. ఈ టీవీని ముందుగా CES 2024 ఈవెంట్ లో LG పరిచయం చేసింది మరియు ఇప్పుడు మార్కెట్ లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ ఓలెడ్ టీవీ రేటు చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి. ఈ టీవీ రేటు గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ టీవీ ప్రైస్ తో హైదరాబాద్ లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG New OLED: ప్రైస్

ఈ ఎల్ జి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీని అమెరికాలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ టీవీని US మార్కెట్లో $60,000 (సుమారు రూ. 51,10,000) ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ టీవీ ఇండియాలో ఈ టీవీని లాంచ్ చేస్తుందో లేదో కంపెనీ ప్రకటించలేదు.

Also Read: జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 10 వేలకే 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!

LG New OLED: ఫీచర్స్

LG ఈ స్మార్ట్ టీవీని 77 ఇంచ్ 4K ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ స్క్రీన్ ను రెగ్యులర్ మోడ్ మరియు ట్రాన్స్ పరెంట్ మోడ్ తో కూడా నడపవచ్చు. ఈ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు 4K AI సూపర్ అప్ స్కేలింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ OLED టీవీ LG యొక్క Alpha 11 ప్రోసెసర్ తో పని చేస్తుంది.

LG New OLED

ఈ టీవీ 4K 120Hz రిఫ్రెష్ రేట్ తో గొప్ప గేమ్ ప్లే అందిస్తుంది. ఈ LG OLED స్మార్ట్ టీవీ DTS:X, AI Sound మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ జీరో కనెక్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo