Kodak పెద్ద స్మార్ట్ టీవీ తక్కువ ధరకే ప్రకటించింది

HIGHLIGHTS

కోడాక్ తన X7X Pro లైనప్ కి సరికొత్తగా మరొక టీవీని జత చేసింది.

ఈ టీవీ Android TV మరియు 60HZ రిఫ్రెష్ రేటుతో వస్తుంది.

ఈ Kodak 42 ఇంచ్ FHD ఆండ్రాయిడ్ టీవీ Flipkart ప్రధాన భాగస్వామిగా విడుదల చెయ్యబడింది.

Kodak పెద్ద స్మార్ట్ టీవీ తక్కువ ధరకే ప్రకటించింది

కోడాక్ తన X7X Pro లైనప్ కి సరికొత్తగా మరొక  టీవీని జత చేసింది. కొత్తగా జత చేసిన టీవీని 42 అంగుళాల పరిమాణంలో FHD రిజల్యూషనుతో FHDX7XPRO గా ప్రకటించింది. ఈ పెద్ద FHD స్మార్ట్ టీవీని కేవలం రూ.19,999 రుపాయల ధరతో ప్రకటించింది.  ఈ టీవీ Android TV మరియు 60HZ రిఫ్రెష్ రేటుతో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్లాస్ట్రోనిక్స్ ప్రవేట్ లిమిటెడ్ నుండి  ప్రకటించబడిన ఈ Kodak 42 ఇంచ్ FHD ఆండ్రాయిడ్ టీవీ Flipkart ప్రధాన భాగస్వామిగా విడుదల చెయ్యబడింది. ఈ టీవీలు జనవరి 20 నుండి Flipkart నుండి లభిస్తాయి.

Kodak 42 ఇంచ్ FHDX7XPRO ప్రత్యేకతలు

Kodak 42 ఇంచ్ FHDX7XPRO టీవీ FHD రిజల్యూషన్, అంటే 1980×1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ Kodak టీవీ  ఆండ్రాయిడ్ టీవీ లో నడుస్తుంది మరియు ఈ టీవిలో 1.4Ghz క్లాక్ స్పీడ్ గల క్వాడ్ కొర్ ప్రొసెసర్ Mali-450MP3 GPU వున్నాయి. ఈ టీవీ షార్ప్ నుండి IPS ప్యానల్ మరియు DLED బ్యాక్ లైట్ తో పాటుగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కలిగివుంది.

ఇక ఆడియో మరియు కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కలిగి వుంటుంది మరియు కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్టులు మరియు 2 USB పోర్టులతో పాటుగా ఈథర్నెట్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ మరియు లైన్ అవుట్ పోర్ట్ లను కూడా కలిగి వుంది.                        

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo