ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ టీవీ రంగంలో కూడా గొప్ప రాణించింది. బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలను విడుదల చేసి ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్, ఇప్పుడు బడ్జెట్ ధరలో మరొక పెద్ద టీవీని ఆవిష్కరించింది. Infinix X3 సిరీస్ నుండి ముందుగా 32 మరియు 43 ఇంచ్ టీవీలను తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు కేవలం 25 వేల రూపాయల ధరలో ఇదే X3 సిరీస్ నుండి 50 ఇంచ్ 4K UHD టీవీని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ టీవీ కొనుగోలుదారులకు అఫర్ చేస్తున్న ఫీచర్లు మరియు ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం పడింది.
Survey
✅ Thank you for completing the survey!
Infinix X3 50 inch 4K UHD TV: ధర మరియు ఆఫర్లు
Infinix X3 50 inch 4K UHD స్మార్ట్ టీవీ Flipkart Big Billion Days నుండి సేల్ కు అందుబాటులోకి వస్తుంది. ఇన్ఫినిక్స్ ఈ 50-ఇంచ్ టీవీని ధర రూ.25,001 ధరతో విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఏ టీవీని Axis మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,750 రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ ఎక్స్3 50 ఇంచ్ 4K UHD TV సన్నని అంచులు కలిగి ఎక్కువ స్క్రీన్ ను అందిస్తుంది మరియు ఇది 94% స్క్రీన్-టూ-బాడీ రేషియాతో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం 122% sRGB కలర్ గాముట్ తో వస్తుంది. అంతేకాదు, గరిష్ట బ్రైట్నెస్, HDR10 సపోర్ట్ మరియు యాంటీ-బ్లూ రే ఎమిషన్ ఫిల్టర్ మొదలుకొని 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు చాలా ఫీచర్లను ఈ టీవీ కలిగివుంది.
ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 24W స్టీరియో స్పీకర్ లను అందించింది మరియు ఇది Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 1.5 GB RAM మరియు 16 GB స్టోరేజ్‌తో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ టీవీ ఆండ్రాయిడ్ R OS పైన రన్ అవుతుంది. మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తుంది.