ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ Infinix ఈరోజు ఇండియాలో అతి తక్కువ ధరకే పెద్ద స్మార్ట్ టీవీ ని ప్రకటించింది. ఇప్పటికే బడ్జెట్ స్మార్ట్ టీవీలను అఫర్ చేస్తున్న ఇన్ఫినిక్స్, చాలా చవక ధరకే తన కొత్త 32 ఇంచ్ స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. Infinix 32y1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో ఉంటుంది మరియు HD Ready స్మార్ట్ టీవీ. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ పైన ఒక లుక్ వేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Infinix 32y1: ధర మరియు సేల్
ఇన్ఫినిక్స్ ఈ Infinix 32y1 స్మార్ట్ టీవీని ఇండియన్ మర్కెట్లో వున్నా బడ్జెట్ ఇతర స్మార్ట్ టీవీలకు గట్టి పోటీని ఇచ్చే ధరలో తీసుకువచ్చింది. ఈ 32-ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీని కేవలం ధర రూ.8,999 ధరలో ప్రకటించింది. జూలై 18 నుండి ఈ స్మార్ట్ టీవీ Flipakrt నుండి అందుబాటులో ఉంటుంది.
ఇక ఈ ఇన్ఫినిక్స్ 32వై1 32-అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ HD-Ready DLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ గరిష్టంగా 250 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W బాక్స్ స్పీకర్ లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంటుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, YPbPr వీడియో అవుట్‌పుట్, 3 HDMI, 2 USB, 1 RJ-45 మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 512MB RAM మరియు 4 GB స్టోరేజ్‌తో స్మార్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ టీవీ Linux OS పైన రన్ అవుతుంది మరియు ఇన్ బిల్ట్ Wi-Fi మరియు మిరక్యాస్ట్ తో వస్తుంది.