ఇండియాలో మరొక రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చెయ్యడానికి Infinix సిద్ధమవుతోంది. X సిరీస్ నుండి మరొక రెండు స్మార్ట్ టీవీలను X3 పేరుతో ప్రకటించనున్నట్లు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ప్రకటించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీలను లేటెస్ట్ ఫీచర్లతో రెండు సైజుల్లో తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ టీవీల కోసం Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఒక ప్రత్యేకమైన పేజీని కూడా అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
ఫ్లిప్ కార్ట్ లో లిస్టింగ్ చేసిన ఇంన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ టీవీల యొక్క కొన్ని ముఖ్యమైన వివరాలను ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ పేజ్ టీజర్ ద్వారా వివరించింది. దీని ప్రకారం, ఇన్ఫినిక్స్ X3 సిరీస్ స్మార్ట్ టీవీలను రెండు పరిమాణాలలో మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. అందులో, HD రిజల్యూషన్ టీవీని 32-ఇంచ్ లో మరియు FHD రిజల్యూషన్ టీవీని 43-ఇంచ్ సైజులో అందిస్తుంది.
పైన తెలిపిన విధంగా ఈ X3 సిరీస్ నుండి 32&43 ఇంచ్ పరిమాణంలో స్మార్ట్ టీవీలు ఉంటాయి. ఈ టీవీల స్క్రీన్‌లు 96% స్క్రీన్-టు-బాడీ రేషియో, NTSC కలర్ గ్యమూట్ లో 85% కవరేజీని కలిగి ఉన్నాయి. అంతేకాదు, ఈ టీవీలు 400 Nits పీక్ బ్రైట్నెస్ తో వస్తాయి. అదనంగా, ఈ టీవీలు HDR10 మరియు HLG ఫార్మాట్ లకు కూడా సపోర్ట్ ను కలిగివుంటాయి.
ఇక సౌండ్ మరియు యాతర ఫీచర్ల పరంగా, ఈ టీవీలు Dolby Audio Sound టెక్నాలజీ సపోర్ట్ కలిగివుంటాయి మరియు హెవీ సౌండ్ అందించగల 36W క్వాడ్-స్పీకర్ సెటప్ తో జతచేయబడ్డాయి. Infinix సంస్థ, ఆండ్రాయిడ్ 11 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఈటీవీ లను షిప్పింగ్ చేస్తుంది మరియు మీరు జనాదరణ పొందిన OTT యాప్‌లు, ప్లే స్టోర్ లైబ్రరీ, Google Assistant మరియు Chromecast సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీల గురించి కేవలం టీజింగ్ మాత్రమే మొదలుపెట్టింది. ఈ టీవీల యొక్క లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ టీవీలు మార్చి రెండో వారంలో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు.