భారీ డిస్కౌంట్ తో JVC QLED Smart tv ని 15 వేల ధరలోనే అందుకోండి.!
JVC QLED Smart tv ని మంచి ఆఫర్ ధరకే అందుకునే అవకాశం
JVC లేటెస్ట్ టీవీని కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చు
అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేద్దామా
JVC QLED Smart tv ని ఈరోజు మంచి ఆఫర్ ధరకే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ JVC లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveyJVC QLED Smart tv : ఆఫర్
JVC రీసెంట్ గా విడుదల చేసిన 40 ఇంచ్ FHD క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ LT-40NQ3165C ని ఈరోజు 24% డిస్కౌంట్ తో రూ. 15,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ జెవిసి స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కోవే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 14,999 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here
JVC QLED Smart tv : ఫీచర్స్
ఈ జెవిసి క్యూలెడ్ స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన 40 ఇంచ్ QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDR మరియు HLG సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రియల్ టెక్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 1 GB RAM + 8 GB స్టోరేజ్ తో వస్తుంది.

ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది మరియు 48W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI eARC, USB, బ్లూటూత్, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లతో కూడా వస్తుంది.
Also Read: POCO M7 5G Sale: ఈరోజు నుంచి మొదలైన పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్.!
బడ్జెట్ ధరలో FHD క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారు పరిశీలించ తగిన స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile