లేటెస్ట్ Vu 55 Glo Mini LED స్మార్ట్ టీవీ పై అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

గొప్ప విజువల్స్ అందించే కొత్త స్మార్ట్ టీవీ కోసం వెతికే వారికి గుడ్ న్యూస్

బిగ్ డీల్ తో లేటెస్ట్ Vu 55 Glo Mini LED స్మార్ట్ టీవీ మంచి రీజనబుల్ ధరలో లభిస్తోంది

ఈ టీవీ ఈరోజు లభించే ఆఫర్ ధరలో చాలా బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది

గొప్ప విజువల్స్ అందించే కొత్త స్మార్ట్ టీవీ కోసం వెతికే వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్ తో లేటెస్ట్ Vu 55 Glo Mini LED స్మార్ట్ టీవీ మంచి రీజనబుల్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈ సంవత్సరం లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఈ టీవీ ఈరోజు లభించే ఆఫర్ ధరలో చాలా బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.

Vu 55 Glo Mini LED స్మార్ట్ టీవీ

Vu లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన 55 ఇంచ్ గ్లో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ VU GLO MINI LED 2026 మోడల్ పై అమెజాన్ ఇండియా ఈరోజు బెస్ట్ డీల్స్ అందించింది. అందుకే, ఈ బిగ్ గ్లో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 45,990 ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది మరియు ఈ టీవీని PNB కార్డ్స్ తో కొనుగోలు చేస్తే రూ. 1,000 నుంచి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ రూ. 43,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Lava Bold N4 Lite: అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన లావా.!

Vu 55 Glo Mini LED స్మార్ట్ టీవీ ఫీచర్స్

ఈ వియు స్మార్ట్ టీవీ 55 ఇంచ్ క్యుడి మినీ ఎల్ఈడి డిస్ప్లేని 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 120Hz VRR రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10, HLG, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఏఐ పిక్చర్, ఏఐ కాంట్రాస్ట్ మరియు ఏఐ అప్ స్కేల్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ VuOn AI ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు మంచి ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ 2.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు VuFX 50W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో 2 బిల్ట్ ఇన్ ఉఫర్ మరియు 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఈ టీవీ డాల్బీ అట్మోస్, డైలాగ్ ఎన్ హెన్సర్ మరియు ఆడియో ఓన్లీ మోడ్ వంటి ఆడియో ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్ అవుట్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనికా కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :