/var/www/html/wp-shared-data/advanced-cache.php అండర్ రూ. 10,000 ధరలో బిగ్ QLED Smart Tv విడుదల చేసిన Blaupunkt

అండర్ రూ. 10,000 ధరలో బిగ్ QLED Smart Tv విడుదల చేసిన Blaupunkt

HIGHLIGHTS

Blaupunkt ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని పరిచయం చేసింది

Jio Tele OS ను ఇప్పుడు 32 ఇంచ్ స్మార్ట్ టీవీలలో కూడా పరిచయం చేసింది

తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో 32 ఇంచ్ QLED Smart Tv ని అందించగలిగింది

అండర్ రూ. 10,000 ధరలో బిగ్ QLED Smart Tv విడుదల చేసిన Blaupunkt

ప్రముఖ జర్మన్ బ్రాండ్ Blaupunkt ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని పరిచయం చేసింది. ఇప్పటివరకు 43 ఇంచ్ మరియు అంత కంటే పెద్ద స్క్రీన్ లలో మాత్రమే అందుబాటులో ఉన్న Jio Tele OS ను ఇప్పుడు 32 ఇంచ్ స్మార్ట్ టీవీలలో కూడా పరిచయం చేసింది. దీనితో కేవలం 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో 32 ఇంచ్ QLED Smart Tv ని అందించగలిగింది. బ్లౌపంక్ట్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Blaupunkt (32) QLED Smart Tv : ప్రైస్

బ్లౌపంక్ట్ ఈ లేటెస్ట్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 9,699 బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ జనవరి 22వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ చివరి రోజు సలికి అందుబాటులోకి వస్తుంది కాబట్టి మంచి బ్యాంక్ ఆఫర్స్ తో కూడా లభిస్తుంది.

Also Read: OPPO A6 5G: బేసిక్ 5జి ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Blaupunkt (32) QLED Smart Tv : ఫీచర్స్

ఈ బ్లౌపంక్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366 x 768) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు HDR సపోర్ట్‌తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ కలిగిన బెజెల్‌ లెస్ డిజైన్ తో స్టైలిష్ లుక్ మరియు పెద్ద స్క్రీన్ అనుభూతి మీకు ఇస్తుంది. ఇది Amlogic క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 1 జీబీ ర్యామ్ అండ్ 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది Jio Tele OS తో నడుస్తుంది మరియు అన్ని ఇండియన్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేస్తుంది.

Blaupunkt (32) QLED Smart Tv

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 48W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ బాస్ ట్యూబ్ స్పీకర్లు కలిగి మంచి బాస్ సౌండ్ అందిస్తుందని కూడా బ్లౌపంక్ట్ చెబుతోంది. కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, USB, HDMI, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 400+ ఉచిత లైవ్ ఛానల్స్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo