OnePlus Nord Buds 4 Pro: పవర్ ఫుల్ బాస్ మరియు LHDC తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ కొత్త బడ్స్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది

OnePlus Nord Buds 4 Pro పవర్ ఫుల్ బాస్ అందించే డ్రైవర్స్ మరియు LHDC తో లాంచ్ అవుతోంది

టైటానియం కోటెడ్ 12mm డ్రైవర్స్ (స్పీకర్లు) తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ వెల్లడించింది

OnePlus Nord Buds 4 Pro: పవర్ ఫుల్ బాస్ మరియు LHDC తో లాంచ్ అవుతోంది.!

OnePlus Nord Buds 4 Pro: వన్ ప్లస్ కొత్త బడ్స్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను పవర్ ఫుల్ బాస్ అందించే డ్రైవర్స్ మరియు LHDC తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ టీజర్ తో లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లను కూడా రివీల్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord Buds 4 Pro: లంచ్ డేట్

వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ ను మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ లాంచ్ కోసం ఆమెజాన్ ప్రత్యేకంగా అందించిన మైక్రోసైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక వివరాలను రివిల్ చేసింది.

OnePlus Nord Buds 4 Pro : ఫీచర్లు

వన్ ప్లస్ బడ్స్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ ను గొప్ప బాసు సౌండ్ అందించే టైటానియం కోటెడ్ 12mm డ్రైవర్స్ (స్పీకర్లు) తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ వెల్లడించింది. ఈ బడ్స్ ఈ స్పీకర్ తో జతగా Hi-Res Audio మరియు LHDC సౌండ్ సపోర్ట్ తో లీనమయ్యే గొప్ప సౌండ్ అందిస్తుందని వన్ ప్లస్ టీజర్ లో తెలిపింది. ఇది కాకుండా ఇందులో 3D స్పేషియల్ ఆడియో మరియు గేమ్ సౌండ్ స్పేషియల్ ఆడియో ఫీచర్స్ కూడా అందించింది.

OnePlus Nord Buds 4 Pro

ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ 52dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్ తో కూడా వస్తుంది. ఇది లీనమయ్యే మ్యూజిక్ మరియు కాలింగ్ కోసం అనువైన ఫీచర్. ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ వాల్యూమ్ స్వైప్ మరియు టచ్ కంట్రోల్ వంటి స్మార్ట్ కంట్రోల్స్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. కాలింగ్ కోసం ఈ ఇయర్ బడ్స్ లో 6 మైక్ సెటప్ ను వన్ ప్లస్ అందించింది. ఇది గొప్ప కాలింగ్ కోసం చక్కగా సరిపోతుంది.

Also Read: సమ్మర్ హీట్ ని బీట్ చేసే బెస్ట్ Air Cooler డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

ఇక డిజైన్ విహాస్యానికి వస్తే, ఈ బడ్స్ బి బాక్స్ ను జేబులో పెట్టుకోవడానికి వీలైన రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ తో అందించింది. ఇది కాకుండా ఇది స్ట్రాంగ్ బిల్డ్ తో ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. టోటల్ గా ఈ బడ్స్ ను మంచి ఫీచర్స్ మరియు బిల్ట్ క్వాలిటీ తో లాంచ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile