జస్ట్ 55 ఇంచ్ టీవీ రేటుకే 75 ఇంచ్ QLED Smart Tv లభిస్తుంది .. ఎక్కడ భయ్యా ఈ ఆఫర్.!

HIGHLIGHTS

స్మార్ట్ టీవీ ధరలు బాగా తగ్గాయని తెలుసు కానీ ఇంత చవక ధరలో లభిస్తాయని అనుకోలేదు

ఇండియాలో రీసెంట్ గా విడుదలైన ఒక లేటెస్ట్ 75 QLED Smart Tv జస్ట్ 55 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తోంది

తక్కువ ధరలో 75 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చేసే వారు ఈ డీల్ ని చూడొచ్చు

స్మార్ట్ టీవీ ధరలు బాగా తగ్గాయని తెలుసు కానీ, మరీ ఇంత చవక ధరలో లభిస్తాయని అనుకోలేదు. సడన్ గా ఉదేశ్యం ఎందుకు వచ్చింది బ్రో? అని మీరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా, దానికి రీజన్ ఉంది బ్రో. ఇండియాలో రీసెంట్ గా విడుదలైన ఒక లేటెస్ట్ 75 QLED Smart Tv జస్ట్ 55 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తోంది. తక్కువ ధరలో 75 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చేసే వారు ఈ డీల్ ని చూడొచ్చు.

75 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ ఏమిటి?

acer pure ఇండియాలో రీసెంట్ విడుదల చేసిన 2025 నిట్రో సిరీస్ 75 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (AP75UG75PNTO5) మోడల్ ఈరోజు ఈ ప్రైస్ లో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 57% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 53,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఈ బిగ్ డిస్కౌంట్ కాకుండా ఈ స్మార్ట్ టీవీపై రూ. 4,200 రూపాయల PNB క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 49,799 ప్రైస్ లో లభిస్తుంది. అంటే, ఈ లేటెస్ట్ 75 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధరకే మీకు లభిస్తుంది.

Also Read: Realme P4s పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

75 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ 75 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 4K UHD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 2జీబి ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ మరియు స్టాండ్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో స్పీకర్లు మరియు ట్వీటర్ సెటప్ కూడా అందించింది. ఈ టీవీ టోటల్ 50w అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS తో నడుస్తుంది. ఈ టీవిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi బ్లూటూత్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, ఈథర్నెట్ పోర్ట్, HDMI, USB మరియు ఆప్టికల్ అవుట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :