రూ. 20,000 లోపు బెస్ట్ 4K QLED స్మార్ట్ టీవీ కావాలా .. ఈరోజు బెస్ట్ ఆప్షన్ ఇదే.!

HIGHLIGHTS

4K స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఈరోజు బెస్ట్ 4K QLED Smart TV ఒకటి అందుబాటులో ఉంది

ఈ టీవీ మీకు కేవలం రూ.18,999 రూపాయల బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది

ఈ స్మార్ట్ టీవీ 20 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ లలో ఒకటిగా నిలుస్తుంది

తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన 4K స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఈరోజు బెస్ట్ 4K QLED Smart TV ఒకటి అందుబాటులో ఉంది. ఈ టీవీ మీకు కేవలం రూ.18,999 రూపాయల బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. ఈ 43 అంగుళాల QLED టీవీ 20 వేల రూపాయల లోపు కొనుగోలు చేయదగిన అత్యుత్తమ స్మార్ట్ టీవీ లలో ఒకటిగా చెప్పవచ్చు.

ఏమిటి ఈ 4K QLED స్మార్ట్ టీవీ డీల్?

2025 మధ్యలో Jio TeleOS ఆపరేటింగ్ సిస్టం తో ప్రముఖ స్మార్ట్ టీవీ కంపెనీ Thomson విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ 43TJQ0012 గురించే మనం మాట్లాడుకుండుంది. ఈ స్మార్ట్ టీవీ 20 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 37% డిస్కౌంట్ తో కేవలం రూ. 18,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.

Thomson 4K QLED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 43 అంగుళాల పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను UHD (4K) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇది (3840 × 2160) పిక్సెల్స్ రిజల్యూషన్, HDR10 సపోర్ట్, 450 నిట్స్ బ్రైట్‌ నెస్ మరియు 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌ లు మరియు స్పోర్ట్స్ కంటెంట్‌ అద్భుతమైన కలర్స్‌తో ఆస్వాదించవచ్చు. ఈ టీవీ కలిగిన బెజెల్ లెస్ డిజైన్ కారణంగా స్క్రీన్ మరింత ప్రీమియం గా కనిపిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా కూడా ఈ టీవీ గొప్పగా ఆకట్టుకుంటుంది. ఇందులో 40W సౌండ్ అవుట్‌ పుట్ అందిస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో స్పష్టమైన మరియు శక్తివంతమైన సౌండ్ ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా, స్పోర్ట్ మోడ్ ఫీచర్ వల్ల క్రికెట్, ఫుట్‌ బాల్ మరియు ఇతర స్పోర్ట్స్ ఈవెంట్లను మరింత చక్కగా వీక్షించవచ్చు.

Also Read: Motorola Edge 70 Pro Plus పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు కెమెరాతో లాంచ్ అవుతోంది.!

JioTele OS ఆధారంగా పనిచేసే ఈ టీవీలో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, YouTube వంటి ప్రముఖ OTT యాప్‌ లు ముందుగానే అందుబాటులో ఉంటాయి. అదనంగా, 400 కు పైగా ఉచిత Live TV ఛానెల్స్, 400 కు పైగా గేమ్స్ మరియు Web Browser వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ప్రత్యేక DTH కనెక్షన్ లేకుండానే విభిన్న వినోద కంటెంట్‌ ను వీక్షించే అవకాశం మీకు లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ వాటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :