ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp లో AI అసిస్టెంట్ సేవలను ఉపయోగిస్తున్న వారికి కొత్తగా ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే, వాట్సాప్ లో వుండే Instinct AI అనే పర్సనల్ అసిస్టెంట్ ద్వారా వినియోగదారులకు సమాధానాలు పంపడం అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో Meta సంస్థ ఈ AI ఏజెంట్ ను వాట్సాప్ నుంచి బ్లాక్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ పరిణామంపై Instinct సంస్థ వివరణ ఇచ్చింది. వివరణ ప్రకారం, సమస్యకు ప్రధాన కారణం వాట్సాప్ లోని నిషేధం కాకుండా సంస్థకు సంబంధించిన బిల్లింగ్ వ్యవహారమేనని కంపెనీ తేల్చింది.
ఇన్స్టింక్ట్ అనేది వినియోగదారుల రోజువారీ పనులు నిర్వహించేందుకు రూపొందించిన పర్సనల్ AI ఏజెంట్. దీని ద్వారా యూజర్లు మెసేజ్, ఈ-మెయిల్స్, క్యాలెండర్ షెడ్యూల్స్ మరియు ఇతర అవసరమైన పనులను నిర్వహించుకోవచ్చు. యాప్ ను ప్రతిసారీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్, iMessage వంటి మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా దీనితో సంభాషించవచ్చు.
అయితే, ఇన్స్టింక్ట్ నుంచి వాట్సాప్ లో రిప్లైలు అందకపోవడంతో నవంబర్ 1న జరిగినట్లు కొంతమంది వినియోగదారులు వెల్లడించారు. కొందరు తమ వాట్సాప్ అకౌంట్ కూడా బ్యాన్ అయ్యాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పటి నుంచి ఈ సమస్య వెలుగులోకి వచ్చింది.
ఈ అంతరాయానికి సంబంధించి వెలువడిన సమాచారం ప్రకారం, ఇన్స్టింక్ట్ సంస్థకు చెందిన WhatsApp Business ఖాతాలో చెల్లింపులకు సంబంధించిన సమస్య ఏర్పడింది. దీంతో వాట్సాప్ ద్వారా అవుట్ గోయింగ్ మెసేజ్ పంపడంలో అంతరాయం కలిగింది. అయితే, వినియోగదారులు పంపిన ఇన్ కమింగ్ మెసేజ్ లు మాత్రం ఇన్స్టింక్ట్ సిస్టమ్ కు చేరుతున్నాయని సమాచారం. కొంతమంది యూజర్లకు iMessage ద్వారా సమాధానాలు అందినట్లు కూడా తెలుస్తోంది.
Also Read: Smart TV కొన్న తర్వాత ఎక్కువ మంది చేసే ఈ 7 తప్పులు మీరు అస్సలు చేయకండి.!
ఇక్కడ మనం గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే Meta గతంలో WhatsApp Business API నిబంధనలు మార్చి, సాధారణ ప్రయోజనాల కోసం పని చేసే థర్డ్ పార్టీ AI చాట్ బాట్ లపై పరిమితులు విధించింది. ఈ కొత్త నిబంధనలు 2026 జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, ఇన్స్టింక్ట్ తాజా అంతరాయాన్ని Meta నేరుగా బ్లాక్ చేసిందని నిర్ధారించే ఆధారాలు లేవు. అంతేకాదు, బిల్లింగ్ సమస్యే ప్రధాన కారణంగా అనేక వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారమైనట్లు సమాచారం. అయితే, కొంతమంది యూజర్లు ఎదుర్కొన్న అకౌంట్ బ్యాన్ లకు గల కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ పరిణామం AI సేవలు మెసేజింగ్ యాప్ లపై ఎంతవరకు ఆధారపడుతున్నాయి, అని మరోసారి చూపించింది.