Smart TV కొన్న తర్వాత ఎక్కువ మంది చేసే ఈ 7 తప్పులు మీరు అస్సలు చేయకండి.!
మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని నెలల తరబడి ప్లాన్ చేస్తారు
చివరకు తమ బడ్జెట్ కు తగిన ఒక మంచి టీవీని కొనుగోలు చేస్తారు
Smart TV కొన్న తర్వాత ఎక్కువ మంది చేసే ఈ 7 తప్పులు మీరు అస్సలు చేయకండి
తమ ఇంటికి తగిన మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని నెలల తరబడి ప్లాన్ చేస్తున్నారు. స్మార్ట్ టీవీ సెలక్షన్ చేయడానికి ఏ బ్రాండ్ టీవీ తీసుకోవాలి, 4K రిజల్యూషన్ ఉండాలి, QLED, OLED లేదా Mini LED ఏది మంచిది మరియు ఎంత పెద్ద స్క్రీన్ కావాలి, అని తర్జన భర్జన పడిపోతారు. ఎన్నో విషయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చివరకు తమ బడ్జెట్ కు తగిన ఒక మంచి టీవీని కొనుగోలు చేస్తారు. అయితే, ఈ టీవీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మాత్రం దాని సెట్టింగ్స్ మరియు నిర్వహణ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించరు. నిజానికి, ఒక కొత్త స్మార్ట్ టీవీ కొనడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన విధంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం అని గమనించాలి. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల పిక్చర్ క్వాలిటీ తగ్గడం, యాప్స్ నెమ్మదిగా ఓపెన్ అవ్వడం లేదు పనిచేయడం, ఇంటర్నెట్ సమస్యలు రావడం, సౌండ్ సరిగా వినిపించకపోవడం వంటి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే Smart TV కొన్న తర్వాత ఎక్కువ మంది చేసే ఈ 7 తప్పులు మీరు అస్సలు చేయకండి.
SurveySmart TV
చాలా మంది కొత్త స్మార్ట్ టీవీ ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత, ఆ టీవీని అలాగే ఉపయోగించడం మాత్రమే ఇష్టపడుతుంటారు. అంటే, టీవీ పైన కవర్ తొలగించక పోవడం, కొత్త టీవీని ఎప్పటికీ కొత్త టీవీ లాగా మాత్రమే ఉంచడానికి ప్రయత్నించడం మరియు టీవీతో వచ్చే సెట్టింగ్స్ నీ మాత్రమే ఉపయోగించడం వంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి ఒక ఏడు తప్పులు ఎక్కువ మంది తమ కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు తర్వాత చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. వాటి గురించి ఈరోజు మీరు తెలుసుకొని ఆ తప్పులు చేయకుండా మీ స్మార్ట్ టీవీని ఎప్పటికీ కొత్త స్మార్ట్ టీవీగా ఉంచుకునే ప్రయత్నం చేయవచ్చు.
డిఫాల్ట్ పిక్చర్ సెట్టింగ్స్‌తోనే టీవీని ఉపయోగించడం
కొత్త టీవీని ఆన్ చేసినప్పుడు స్క్రీన్ చాలా బ్రైట్ గా ఉంటుంది మరియు రంగులు కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీంతో చాలా మంది ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అలాగే ఉంచేస్తారు. కానీ ప్రతి గదిలో ఉండే వెలుతురు ఒకేలా ఉండదని మీరు గుర్తించుకోవాలి. ఎక్కువ బ్రైట్ నెస్ మరియు అధిక కలర్ సెట్టింగ్స్ వల్ల సినిమాలు, వెబ్ సిరీస్ లలో సహజమైన రంగులు కనిపించక పోవచ్చు. ఎక్కువ సేపు టీవీ చూసేటప్పుడు వీక్షకులకు అసౌకర్యం కూడా కలగవచ్చు.

అందుకే, మీ గదిలో ఉన్న వెలుతురుకు అనుగుణంగా పిక్చర్ సెట్టింగ్స్ మార్చుకోవాలి. సినిమాల కోసం Movie లేదా Filmmaker Mode ఎంచుకోండి. అలాగే, సాధారణ కార్యక్రమాల కోసం Standard Mode మీరు ఉపయోగించవచ్చు. అవసరాన్ని బట్టి బ్రైట్ నెస్, కాంట్రాస్ట్, షార్ప్ నెస్ వంటి సెట్టింగ్స్ ను సర్దుబాటు చేసుకోవాలి. అయితే, కొన్ని స్మార్ట్ టీవీ లలో ఆటో బ్రైట్ నెస్ ఫీచర్ వస్తుంది. ఈ ఫీచర్ ని ఆన్ చేసి ఉంచితే మీ రూమ్ లో ఉన్న వెలుగును బట్టి టీవీ తన బ్రైట్ నెస్ లెవల్ ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది.
సాఫ్ట్ వేర్ అప్డేట్ నిర్లక్ష్యం చేయడం
స్మార్ట్ టీవీ అనేది కేవలం టీవీ మాత్రమే కాదు, అది ఒక కంప్యూటర్ లాగా పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో Android TV, Google TV, webOS మరియు Tizen వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ టీవీల తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు వీటికి సాఫ్ట్ వేర్ అప్డేట్స్ విడుదల చేస్తుంటాయి.
అయితే, చాలా మంది కొత్త టీవీ కొనుగోలు చేసిన తర్వాత ఈ సాఫ్ట్ వేర్ అప్డేట్ గురించి అస్సలు పట్టించుకోరు. దీనివల్ల పాత సాఫ్ట్ వేర్ తోనే ఈ టీవీ చాలా కాలం రాం అవుతుంది. ఇది ఈ టీవీ పెర్ఫార్మెన్స్ లో పెను మార్పులు తీసుకు వస్తుంది. కొత్త అప్డేట్స్ లో కొత్త భద్రతా వ్యవస్థ, బగ్ పరిష్కారాలు, యాప్ అనుకూలత మరియు మెరుగైన పెర్ఫార్మెన్స్ వంటి అందుతాయి. అందుకే, కొత్త వైటీవ్ తెచ్చిన తర్వాత మీరు ఈ తప్పు చేయకండి.
కాబట్టి టీవీ సెట్టింగ్స్ లో Software Update విభాగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అప్డేట్ సమయంలో టీవీ పవర్ ను ఆఫ్ చేయకూడదు.
టీవీని ఎక్కడబడితే అక్కడ ఫిట్ చేయడం
కొత్త టీవీ కొనుగోలు చేసిన ఆనందంలో చాలా మంది ఇంట్లో అందంగా కనిపించే ప్రదేశాలు వెతికి మరీ టీవీని అక్కడ ఫిట్ చేస్తారు. కానీ, నిజానికి టీవీని ఫిట్ చేసే లేదా అమర్చే స్థలం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, టీవీ ఒఇక ఎలక్ట్రానిక్ పరికరం మరియు ఇది కూడా స్వల్పంగా ఏడెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి, గోడకు మరీ దగ్గరగా లేదా గాలి ప్రసరణ లేని చిన్న క్యాబినెట్ లో అమర్చడం వల్ల వేడి బయటకు వెళ్లడానికి ఇబ్బంది కలగవచ్చు. అందుకే, గోడకు మరియు టీవీకి మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూడండి.
అలాగే నేరుగా సూర్యరశ్మి పడే ప్రాంతాల్లో టీవీని ఏర్పాటు చేయడం మంచిది కాదు. అధిక తేమ, దుమ్ము ఉండే ప్రదేశాలకు కూడా టీవీ దూరంగా ఉండాలి. తయారీ సంస్థ టీవీ వెనుక భాగంలో సూచించిన విధంగా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. అలాగే, వాల్ మౌంట్ ఉపయోగిస్తే టీవీ బరువుకు తగిన బ్రాకెట్ ను ఎంచుకోవాలి. ఇది మీ టీవీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
ఇబ్బడిముబ్బడి గా యాప్స్ డౌన్లోడ్ చేయడం
స్మార్ట్ టీవీలో యాప్ స్టోర్ అందుబాటులో ఉండటంతో చాలా మంది కనిపించిన ప్రతి యాప్ ను ఇబ్బడి ముబ్బడిగా ఇన్ స్టాల్ చేస్తుంటారు. వీడియో స్ట్రీమింగ్ యాప్స్, గేమ్స్, మ్యూజిక్ యాప్స్ ఇలా అనేక అప్లికేషన్లను డౌన్ లోడ్ చేస్తారు. అయితే, టీవీలో చాలా పరిమిత స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. టీవిలో స్మార్ట్ ఫోన్ మాదిరిగా 128 జీబీ, 256 జీబీ లాగా బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టీవీలో సాదరణంగా 8 జీబీ నుంచి 64 జీబీ వరకు మాత్రమే స్టోరేజ్ లభిస్తోంది.
కాబట్టి, అవసరం లేని యాప్స్ ఎక్కువగా టీవిలో ఉంటే టీవీ స్టోరేజ్ తగ్గిపోవచ్చు. అంతేకాదు, కొన్ని యాప్స్ క్యాష్ డేటాను కూడా ఎక్కువగా ఉపయోగిస్తాయి. దీంతో టీవీ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ టీవీలో మీరు తరచూ ఉపయోగించే యాప్స్ మాత్రమే ఉంచుకోవాలి. మీరు ఉపయోగించని యాప్స్ ను తొలగించాలి. అలాగే, తెలియని వెబ్‌సైట్స్ నుంచి APK ఫైల్స్ డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయకూడదు.
Wi-Fi కనెక్షన్ పై సరైన శ్రద్ధ లేక పోవడం
కొత్త స్మార్ట్ టీవీలో YouTube, Netflix మరియు Prime Video వంటి యాప్స్ ఉపయోగించాలంటే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. అయితే, చాలా మంది టీవీని ఏదో ఒక ఇంటర్నెట్ కనెక్ట్ చేశామా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. Wi-Fi సిగ్నల్ బలహీనంగా ఉన్నా కూడా అదే కనెక్షన్ ను ఉపయోగిస్తుంటారు.
దీని వల్ల 4K వీడియోలు చూస్తున్నప్పుడు మీ టీవిలో బఫరింగ్ రావచ్చు మరియు వీడియో క్వాలిటీ ఆటోమేటిక్ గా తగ్గవచ్చు. కాబట్టి Wi-Fi రూటర్ కు మరియు మీ టీవీకి మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. టీవీ, రూటర్ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తే మీరు 5GHz బ్యాండ్ ఉపయోగించవచ్చు. వీలైతే Ethernet కేబుల్ ద్వారా నేరుగా కనెక్ట్ చేసుకోవడం కూడా మంచి ఎంపిక అవుతుంది.
సౌండ్ సెట్టింగ్స్ అండ్ HDMI పోర్ట్ నెగ్లిజెన్స్
టీవీ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది డిస్ప్లే క్వాలిటీ, రిఫ్రెష్ రేట్ మరియు రిజల్యూషన్ వంటి ఫీచర్ల పై మాత్రమే ఎక్కువగా దృష్టి సారిస్తారు. కానీ, టీవీ సౌండ్ విషయంలో మాత్రం ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా సౌండ్ బార్ లేదా హోమ్ థియేటర్ ఉపయోగించే సమయంలో సరైన HDMI కనెక్షన్ ఇవ్వక పోవడం వల్ల ఆడియో సమస్యలు రావచ్చు.
మీ టీవీ మరియు సౌండ్ బార్ రెండూ సపోర్ట్ చేస్తే HDMI ARC లేదా eARC పోర్ట్ ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి HDMI-CEC, eARC సెట్టింగ్స్ ను కూడా యాక్టివేట్ చేయాలి. అలాగే, టీవీలో Sound Output ఆప్షన్ లో సరైన ఆడియో డివైజ్ ఎంచుకోవాలి. Dolby Atmos వంటి ఫీచర్లు పని చేయాలంటే టీవీ, సౌండ్ బార్ మరియు మీరు టీవిలో ప్లే చేస్తున్న కంటెంట్ కూడా ఆ ఫార్మాట్ కు అనుకూలంగా ఉండాలి.
Also Read: Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను రూ. 47,000 భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకోండి.!
సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ నిర్లక్ష్యం
స్మార్ట్ టీవీలో ఇంటర్నెట్, యాప్స్, వ్యక్తిగత అకౌంట్ ఉపయోగిస్తున్నప్పుడు భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం అవుతుంది. కొత్త టీవీ సెటప్ సమయంలో చాలా మంది ప్రతి అనుమతిని ఆలోచించకుండా అంగీకరిస్తుంటారు. కొన్ని యాప్స్ లొకేషన్, మైక్రోఫోన్ లేదా ఇతర అనుమతులు అడగవచ్చు.
అయితే, మీరు మీ టీవీ అవసరాన్ని బట్టి కేవలం మీకు అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వాలి. టీవీలో అందుబాటులో ఉన్న Privacy Settings, Viewing Data, Personalized Ads వంటి ఆప్షన్లను కూడా పరిశీలించాలి. Google లేదా ఇతర అకౌంట్లకు బలమైన పాస్ వర్డ్ ఉపయోగించాలి. అలాగే, అనుమానాస్పద యాప్స్‌ను ఇన్స్టాల్ చేయకూడదు. మీ టీవీ యాక్సెస్ ని ఇతరులకు ఇచ్చే ముందు వ్యక్తిగత అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవాలి.
ఒక స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో, ఆ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మనం అంతే జాగ్రతలు తీసుకోవాలి. ఇది ఎంటర్టైన్మెంట్ మరియు సెక్యూరిటీ కి కూడా సంబంధించిన విషయం, అని గుర్తుంచుకోండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
