Karbonn Rebel and rebel pro launched price starts from rs 10999 only
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ మొబైల్ మార్కెట్లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది. కేవలం ఎంట్రీ మాత్రమే కాదు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని షేక్ చేసే అగ్రెసివ్ ప్రైస్ తో కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా పరిచయం చేసింది. ఈ రోజు కార్బన్ మొబైల్ ఇండియాలో Karbonn Rebel మరియు Rebel Pro అనే రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను బడ్జెట్ ధరలో పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ, మరియు సరికొత్త Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో అందించింది.
కార్బన్ రెబల్ స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.14,999 కాగా, లాంచ్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు. అదనంగా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సెల్ ప్రారంభం అవుతుంది.
కార్బన్ ఈ ఫోన్ ను 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే తో అందించింది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 650 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Helio G81 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా ని అందించారు. ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించడం విశేషం. Android 16 తో పనిచేసే ఈ ఫోన్లో Google Gemini సపోర్ట్, IP64 రేటింగ్ మరియు 1TB వరకు స్టోరేజ్ విస్తరణ సదుపాయం కూడా అందించింది. ఈ ఫోన్ లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది.
కార్బన్ రెబల్ ప్రో మోడల్ ని రూ.14,999 ప్రైస్ తో అందించింది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.12,499 కాగా, రూ.1,000 బ్యాంక్ ఆఫర్ తో కేవలం రూ.11,499 ఆఫర్ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కూడా నవంబర్ 4 నుంచి Amazon ద్వారా సేల్ కి అందుబాటులోకి రానుంది.
Also Read: Samsung 55 4K Smart Tv జబర్దస్త్ పండగ డిస్కౌంట్ ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!
కార్బన్ రెబల్ ప్రో లో 6.7 అంగుళాల HD+ డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 720 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీడియాటెక్ Helio G81 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో, 6GB RAM మరియు 128GB స్టోరేజ్ సపోర్ట్ అందించారు. ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక వైపు 64MP AI కెమెరా, ముందువైపు 16 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 6,000mAh బ్యాటరీతో పాటు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా యూజర్లకు లభిస్తుంది. ఈ ఫోన్ కూడా Android 16 ఆపరేటింగ్ సిస్టం, Google Gemini, IP64 రేటింగ్ మరియు 1TB వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది.