Motorola Edge 70 Pro Plus పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు కెమెరాతో లాంచ్ అవుతోంది.!
Motorola Edge 70 Pro Plus స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది
పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు కెమెరాతో లాంచ్ అవుతోంది
మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్ లో హై ఎండ్ ఫోన్ గా ఇది లాంచ్ అవుతోంది
Motorola Edge 70 Pro Plus స్మార్ట్ ఫోన్ మరో మూడు రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్, పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు కెమెరాతో లాంచ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్ లో హై ఎండ్ ఫోన్ గా ఇది లాంచ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డేట్ కీలక ఫీచర్లు మరియు లాంచ్ డేట్ తెలుసుకోండి.
SurveyMotorola Edge 70 Pro Plus : లాంచ్ డేట్
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 4 జూన్ 2026 తేదీన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే మోటోరోలా ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ రివీల్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ రివీల్ చేసింది.
Motorola Edge 70 Pro Plus : కీలక ఫీచర్స్
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.8 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు గరిష్టంగా 5200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIL 810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంటుంది.

మోటోరోలా ఈ ఫోన్ లో MediaTek Dimensity 8500 Extreme ప్రాసెసర్ అందించింది. ఈ చిప్ సెట్ తో జతగా దీనికి 16GB వరకు ర్యామ్ మరియు UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది 24 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్ మరియు 3.4GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల OS అప్ డేట్స్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తామని మోటరోలా ప్రకటించింది.
కెమెరా పరంగా, వెనుక భాగంలో మూడు 50MP కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంటూ`ఉంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYTIA 710 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ + మాక్రో కెమెరా మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. ఈ టెలిఫోటో కెమెరా 3.5x ఆప్టికల్ జూమ్ మరియు 50x సూపర్ జూమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ తో 4K HDR10+ వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చని కంపెనీ తెలిపింది.
Also Read: 8.1 స్పీకర్ Soundbar అందుకోండి కేవలం రూ. 4,499 ఆఫర్ రేటుకే .. ఎక్కడంటే.!
బ్యాటరీ పరంగా, ఈ ఫోన్ 6500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ని ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లో 90W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కంపెనీ ప్రకారం కేవలం కొన్ని నిమిషాల ఛార్జింగ్ తో ఈ ఫోన్ రోజంతా వినియోగించే బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఈ ఫోన్ కూడా Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
