8.1 స్పీకర్ Soundbar అందుకోండి కేవలం రూ. 4,499 ఆఫర్ రేటుకే .. ఎక్కడంటే.!
బడ్జెట్ ధరలో సౌండ్ బార్ కోసం వెతికే వారి కోసం ఈరోజు ఒక గొప్ప డీల్ వివరాలు అందిస్తున్నాను. ప్రముఖ బ్రాండ్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఒక పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు ఆఫర్ తో కేవలం రూ. రూ. 4,499 ఆఫర్ రేటుకే లభిస్తోంది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఇది 8.1 స్పీకర్ సెటప్ కలిగిన పవర్ ఫుల్ Soundbar మరియు ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Survey8.1 స్పీకర్ Soundbar : ఏమిటి ఈ ఆఫర్?
హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు E GATE లేటెస్ట్ Octopus 330 సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ రూ. 5,499 ప్రైస్ లాంచ్ అయింది. అయితే, ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ ను గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో 8 స్పీకర్లు కలిగిన బార్ తో వచ్చే ఏకైక సౌండ్ బార్ గా నిలుస్తుంది. Buy From Here
8.1 స్పీకర్ Soundbar : ఫీచర్స్ ఏమిటి?
ఈ సౌండ్ బార్ 300W పవర్ అవుట్ పుట్ అందించే పవర్ ఫుల్ సౌండ్ బార్. ఇందులో, 8 స్పీకర్లు కలిగిన బార్ మరియు ప్రత్యేక 6.5 అంగుళాల సబ్ వూఫర్ ఉంటాయి. అయితే, ఇది కేవలం 2.1 ఛానల్ హోమ్ థియేటర్ సిస్టం అని మీరు గమనించాలి. అయితే, ఇది మూవీస్, మ్యూజిక్ మరియు గేమింగ్ సమయంలో మంచి ఆడియో అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా, పెద్ద గదుల్లో కూడా స్పష్టమైన మరియు బలమైన సౌండ్ ను అందించగల సామర్థ్యం దీని ప్రత్యేకత.

ఇందులో మొత్తం 8 ఆడియో స్పీకర్లు ఉండటం వల్ల వర్చువల్ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ మీకు లభిస్తుంది. 8 స్పీకర్లు ఉండటం వలనే కంపెనీ దీనిని “Octa Power” టెక్నాలజీ గా పేర్కొంది. కనెక్టివిటీ పరంగా, బ్లూటూత్ 5.3, HDMI ARC, ఆప్టికల్, USB, AUX వంటి అనేక కనెక్షన్ ఆప్షన్ ఈ సౌండ్ బార్ లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: UIDAI కొత్త Aadhaar App ని లాంచ్ చేసింది .. కొత్త ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఈ సౌండ్ బార్ లో Movie, Music, News అనే మూడు ప్రత్యేక EQ మోడ్ లు ఉన్నాయి. వీటిని ఉపయోగం ఏమిటంటే, వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఆడియో ప్రొఫైల్ ను మార్చుకోవచ్చు. అదనంగా ప్రత్యేక రిమోట్ కంట్రోల్ ద్వారా సోర్స్ ఎంపిక, వాల్యూమ్ నియంత్రణ మరియు సౌండ్ మోడ్ లను సులభంగా నిర్వహించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
