Amazon Great Summer Sale నుంచి షియోమీ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ అమెజాన్ అతిపెద్ద సేల్ నుంచి షియోమీ లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకు అందుకోవచ్చని ఈ ముందస్తుగా ప్రకటించింది. ఈ రోజు రివీల్ చేసిన టాప్ డీల్స్ లో ఈ డీల్ కూడా అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Great Summer Sale : టాప్ డీల్
అమెజాన్ ఇండియా ఈరోజు అప్ కమింగ్ సేల్ టాప్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఇందులో, షియోమీ యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ కూడా వుంది. అదేమిటంటే, షియోమీ A Pro సిరీస్ నుంచి లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్. ఈ స్మార్ట్ టీవీ ఇండియన్ మార్కెట్లో రూ. 24,999 ధరతో విడుదలవ్వగా టీవీని అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 ధరకే ఆఫర్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
ఈ టీవీ పై No Cost EMI మరియు HDFC బ్యాంక్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుందిట. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుంచి రూ. 23,999 రూపాయల ధరతో సేల్ అవుతోంది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్,Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో వస్తుంది మరియు జతగా 2GB ర్యామ్ + 8GB స్టోరేజ్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, ALLM, eARC, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి గొప్ప ఆఫర్ ధరకు లభిస్తుందని అమెజాన్ తెలిపింది.