CMF Buds 2 Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

CMF Buds 2 Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్ చేసింది

బడ్స్ 2a, బడ్స్ 2 మరియు బడ్స్ 2 ప్లస్ మూడు బడ్స్ అందించింది

ఈ మూడు బడ్స్ కూడా వాటి వాటి ఫీచర్స్ కు అనుగుణంగా ప్రైస్ కలిగి ఉంటాయి

CMF Buds 2 Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

CMF Buds 2 Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్ చేసింది. ఇందులో బడ్స్ 2a, బడ్స్ 2 మరియు బడ్స్ 2 ప్లస్ మూడు బడ్స్ ఉన్నాయి. ఈ మూడు బడ్స్ కూడా వాటి వాటి ఫీచర్స్ కు అనుగుణంగా ప్రైస్ కలిగి ఉంటాయి. ఈ మూడు బడ్స్ లో కూడా గొప్ప ANC సపోర్ట్ మరియు గొప్ప సౌండ్ అందించే స్పీకర్లు కలిగి ఉంటాయని నథింగ్ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

CMF Buds 2 Series : ప్రైస్

సిఎంఎఫ్ బడ్స్ 2 సిరీస్ ను 2 వేల నుంచి 3వేల రూపాయల ప్రైస్ బడ్జెట్ లో అందించింది. ఈ మూడు బడ్స్ ధర వివరాలు ఇప్పుడు చూద్దాం. సిఎంఎఫ్ బడ్స్ 2a బేసిక్ బడ్స్ గా ఉంటాయి. బడ్స్ 2a ని రూ. 2,199 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అందించింది. బడ్స్ 2 ను 2,699 ధరతో మరియు బడ్స్ 2 ప్లస్ ఇయర్ బడ్స్ ను రూ. 3,299 రూపాయల ధరతో లాంచ్ చేసింది.

CMF Buds 2 Series

CMF Buds 2a : ఫీచర్స్

ఈ సిరీస్ లో బడ్స్ 2a బేసిక్ వేరియంట్ గా ఉంటాయి. ఈ బడ్స్ లో 12.4mm బయోఫైబర్ స్పీకర్ లను అందించింది. ఈ బడ్స్ 42dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) తో వస్తుంది. ఈ బడ్స్ మంచి కాల్ క్వాలిటీ కోసం HD మైక్ లను AI ENC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ANC Off లో టోటల్ 35 గంటల ప్లే టైం అందిస్తుంది. ఈ బడ్స్ IP 54 రేటింగ్ తో వస్తుంది.

CMF Buds 2 : ఫీచర్స్

బడ్స్ 2 ఈ సిరీస్ లో మిడిల్ ఆర్డర్ రోల్ నిర్వహిస్తుంది మరియు ఫీచర్స్ పరంగా 2a కంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఈ బడ్స్ లో 11 mm PMI స్పీకర్లు అందించింది మరియు జతగా ఇందులో Dirac Opteo సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ బడ్స్ 48dB హైబ్రిడ్ ANC సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 6HD మైక్స్ మరియు క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0 సపోర్ట్ తో గొప్ప కాలింగ్ అందిస్తుంది. ఈ బడ్స్ IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, దూల కనెక్షన్ మరియు స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: CMF Phone 2 Pro: సరికొత్తగా విడుదలైన CMF ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

CMF Buds 2 Plus : ఫీచర్స్

ఈ బడ్స్ ఈ సిరీస్ లో టాప్ ఫీచర్స్ కలిగిన బడ్స్ గా నిలుస్తాయి. గొప్ప సౌండ్ అందించడానికి ఈ బడ్స్ లో N52 మ్యాగ్నెట్ కలిగిన LCP స్పీకర్ లను అందించింది. అంతేకాదు, ఈ బడ్స్ ప్యూర్ సౌండ్ అందించడానికి వీలుగా ఈ బడ్స్ లో Hi-Res LDAC సపోర్ట్ ను కూడా అందించింది. ఈ సిఎంఎఫ్ బడ్స్ స్పెటియల్ ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 50dB హైబ్రిడ్ ANC మరియు 6 HD మైక్స్ తో ENC సపోర్ట్ కలిగి ఉంటుంది. అంటే, బెస్ట్ నోయిస్ క్యాన్సిలేషన్ అందించడమే కాకుండా గొప్ప కాలింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఈ బడ్స్ టోటల్ 61 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile