CMF Phone 2 Pro: సరికొత్తగా విడుదలైన CMF ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
CMF కొత్త ఫోన్ ను ఈరోజు మార్కెట్లో లాంచ్ చేసింది
CMF Phone 2 Pro ను చార్జర్, డేటా కేబుల్ మరియు బ్యాక్ కవర్ తో సహా అందించింది
ఈ ఫోన్ స్లీక్ డిజైన్, ట్రిపుల్ కెమెరా మరియు నాలుగు అందమైన కలర్ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది
CMF Phone 2 Pro: CMF కొత్త ఫోన్ ను ఈరోజు మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ నథింగ్ సబ్ బ్రాండ్ ఈసారి ఈ కొత్త ఫోన్ ను చార్జర్, డేటా కేబుల్ మరియు బ్యాక్ కవర్ తో సహా అందించింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్, ట్రిపుల్ కెమెరా మరియు నాలుగు అందమైన కలర్ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది. సరికొత్తగా విడుదలైన ఈ కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyCMF Phone 2 Pro: ప్రైస్
సిఎంఎఫ్ ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ 8GB+ 128GB వేరియంట్ ను రూ. 18,999 ధరతో అందించింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (8GB+ 256GB) ను రూ. 20,999 రూపాయల ధరతో అందించింది. ఈ ఫోన్ పై ఆకట్టుకునే బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ మొదటి సేల్ మే 5వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart మరియు నథింగ్ e-store నుంచి లభిస్తుంది.
ఆఫర్స్
ఈ ఫోన్ ను ఫస్ట్ సేల్ నుంచి ICICI, Axis, HDFC మరియు SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారు రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ పై రూ. 1,000 ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 16,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకోవచ్చు.
CMF Phone 2 Pro: ఫీచర్స్
ఈ CMF లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 4nm TSMC 5G చిప్ సెట్ మరియు దీనికి జతగా 8GB ఫిజికల్ ర్యామ్ తో పాటు 8GB ర్యామ్ బూస్టర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED Flexible LTPS స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, 2X ఆప్టికల్ జూమ్ మరియు ఇమేజ్ ఎడిటర్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: OnePlus 13s: సరికొత్త డిజైన్ తో వస్తున్న వన్ ప్లస్ ఫోన్.!
ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కేవలం 7.8mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు 185 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జింగ్ కేబుల్, ఛార్జర్, ఎజెక్టర్ మరియు ప్రొటెక్టివ్ కేస్ ను కూడా అందిస్తుంది. CMF ఫోన్ 1 తో పోలిస్తే ఇది పెద్ద అప్గ్రేడ్ గా చెప్పొవచ్చు.