ఇంటిగ్రేటెడ్ Dolby సౌండ్ బార్ Smart Tv పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇంకా మొదలే కాలేదు ఇప్పటి నుంచే భారీ ఆఫర్స్ రిలీజ్ చేయడం ప్రారంభించింది

ఈరోజు Vu ఇంటిగ్రేటెడ్ Dolby సౌండ్ బార్ క్యూలెడ్ Smart Tv పై భారీ ఆఫర్లు ప్రకటించింది

4K UHD QLED స్క్రీన్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను కూడా బిల్ట్ ఇన్ గా కలిగి ఉంటుంది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇంకా మొదలే కాలేదు ఇప్పటి నుంచే భారీ ఆఫర్స్ రిలీజ్ చేయడం ప్రారంభించింది. నిన్న Sony, LG మరియు Samsung స్మార్ట్ టీవీ డీల్స్ టీజర్ రివీల్ చేసిన అమెజాన్, ఈరోజు Vu ఇంటిగ్రేటెడ్ Dolby సౌండ్ బార్ క్యూలెడ్ Smart Tv పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించే 4K UHD QLED స్క్రీన్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను కూడా బిల్ట్ ఇన్ గా కలిగి ఉంటుంది.

Dolby సౌండ్ బార్ Smart Tv ఆఫర్ ఏమిటి?

Vu VIBE సిరీస్ నుంచి ఇండియాలో విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 43 VIBE-DV క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ స్మార్ట్ టీవీ ని ఈరోజు 34% డిస్కౌంట్ రూ. 26,490 ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ని కూడా జత చేసింది.

అదనంగా, ఈ సౌండ్ బార్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని HSBC క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,324 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 24,166 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇంటిగ్రేటెడ్ బిల్ట్ ఇన్ డాల్బీ సౌండ్ బార్ తో వచ్చే ఏకైక క్యూలెడ్ స్మార్ట్ టీవీ గా ఇది నిలుస్తుంది. Buy From Here

Also Read: Back to Campus సేల్ నుంచి కేవలం 9 వేల ఆఫర్ ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ పొందండి.!

Dolby సౌండ్ బార్ Smart Tv : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప 400 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, HDR10 మరియు HLG వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది A.I. ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ స్లీక్ అండ్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవిలో 88W ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ మరియు డీప్ బాస్ సౌండ్ సపోర్ట్ తో సౌండ్ బార్ అవసరం లేకుండా గొప్ప సౌండ్ అందిస్తుంది. చవక ధరలో టీవీ ప్లస్ సౌండ్ బార్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ టీవి డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, ఆప్టికల్, USB, ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :