GFF Sale సూపర్ డీల్: LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

జూలై 31న మొదలైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు ఐదో రోజుకు చేరుకుంది

ఈ సేల్ నుంచి LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ఈరోజు అమెజాన్ అనౌన్స్ చేసింది

ఈ LG టీవీ అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత అతి తక్కువ ధరలో లభిస్తుంది

GFF Sale సూపర్ డీల్: LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

GFF Sale సూపర్ డీల్: జూలై 31న మొదలైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు ఐదో రోజుకు చేరుకుంది. ఈ సేల్ నుంచి LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ఈరోజు అమెజాన్ ఇండియా అనౌన్స్ చేసింది. అమెజాన్ ఈ టీవీ పై మూడు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది అందుకే ఈరోజు ఈ టీవీ అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత అతి తక్కువ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

GFF Sale LG Smart Tv : డీల్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు LG యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ 43UR75006LC పై ఈ డీల్స్ అందించింది. మొదటిది, ఈ స్మార్ట్ టీవీ పై అందించిన 40% భారీ డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ తో టీవీ కేవలం రూ. 29,989 ధరకే సేల్ నుంచి లిస్ట్ అయ్యింది. రెండవది, ఈ స్మార్ట్ టీవీ పై అందించిన రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్. మూడవది, ఈ టీవీ పై అందించిన రూ. 1,500 రూపాయల క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్.

GFF Sale LG Smart Tv Deal

ఈ మూడు డిస్కౌంట్ ఆఫర్ లను మీరు అందుకోగలిగితే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 26,489 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత ఇదే అత్యంత తక్కువ ధర అవుతుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కొనడానికి Buy From Here

LG Smart Tv : ఫీచర్లు

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన LED ప్యానల్ ను 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఎల్ జి టీవీ α5 AI ప్రోసెసర్ 4K Gen6 తో పని చేస్తుంది మరియు AI ThinQ సపోర్ట్ వస్తుంది మరియు WebOS పై నడుస్తుంది. ఈ టీవీ 1.5 GB ర్యామ్ మరియు 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు HGiG ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ టీవీ ALLM, eARC, బ్లూటూత్ 5.0, ఆప్టికల్,ఈథర్నెట్, USB, Av ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, జీ5 వంటి యాప్స్ కి అన్లిమిటెడ్ OTT యాప్ సపోర్ట్ కలిగి ఉంటుంది. సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ వర్చువల్ సరౌండ్ 5.1 అప్ మిక్స్ మరియు AI అకౌస్టిక్ ట్యూనింగ్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

Also Read: NTR vs Hrithik: X ప్లాట్ ఫామ్ పై హాట్ టాపిక్ గా మారిన కొత్త హ్యాష్ ట్యాగ్ ఇదే.!

ఓవరాల్ ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ కలిగిన ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి బెస్ట్ ప్రైస్ డీల్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo