NTR vs Hrithik: నందమూరి తారక రామారావు, తెలుగు ఇండస్ట్రీ ముద్దుగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్ట్ ఎంట్రీ మూవీ WAR 2 కొత్త అప్డేట్ వచ్చిన ప్రతిసారీ X ప్లాట్ ఫామ్ (ఒకప్పటి ట్విట్టర్) పై జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్ మారుతోంది. ఈరోజు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది.
Survey
✅ Thank you for completing the survey!
NTR vs Hrithik:
ఈ రోజు ఈ ప్లాట్ ఫామ్ పై ఎన్టీఆర్ vs హ్రితిక్ రోషన్ హ్యస్ ట్యాగ్ టాప్ 3 ట్రేండింగ్ హ్యస్ టాగ్ గా కొనసాగింది. ఈ హ్యాష్ టాగ్ పై భారీ పోస్ట్ లు మరియు రీపోస్ట్ లతో ఎక్స్ ప్లాట్ ఫామ్ మోత మోగిపోయింది. అంతేకాదు, ఎన్టీఆర్ యాక్షన్ క్లిప్స్ తో కూడిన పోస్ట్ లో ఈ హ్యాష్ పై అత్యధికంగా పోస్ట్ అయ్యాయి. కొన్నింటిలో ఎన్టీఆర్ పులి గా మారిన యానిమేషన్ వీడియోలు కూడా ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటనా చాతుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ‘అరవింద సమేత’ యాక్షన్ సీన్, ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’ సినిమా లోని మాస్ సీన్స్ తో ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోస్ట్ లి ఎక్స్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేశారు. అభిమానుల నుంచి వెల్లువెత్తిన పోస్ట్ ల తాకిడికి ఎక్స్ అకౌంట్ లో ఈ హ్యాష్ టాప్ 3 ప్లేస్ లో నిలబడింది.
వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ నుంచి సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందుకే, ఈరోజు 10 డేస్ టు గో పేరుతో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ లు హీరోలుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ తో ఈ సినిమా భారీగా హైప్ ను సంపాదించుకుంది. అంతేకాదు, ఇటీవల ఎన్టీఆర్ డాన్స్ గురించి హృతిక్ ఇచ్చిన సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ తో ఈ సినిమా పై అభిమానులతో పాటు యావత్ దేశానికి ఏ సినిమా పై అంచనాలు పెంచింది.