what is Jio Prime Membership and what are the benefits know completely
Jio Prime Membership: దేశంలో అత్యధికంగా యూజర్లను కలిగి ఉన్న టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కొత్తగా తన యూజర్ల కోసం మరొక ఆఫర్ ని తీసుకొచ్చింది. అదే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ మరియు ఇది జియో యూజర్లు అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ కొత్త ప్రైమ్ సభ్యత్వం ఉంటే ఏ ప్రయోజనాలు లభిస్తాయి? Amazon Prime తో దానికి ఏదైనా సంబంధం ఉందా? అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఇదే సందేహం మీకు ఉన్నట్లయితే, ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవచ్చు.
జియో ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది జియో మొబైల్ నెంబర్ వినియోగదారులకు జియో ఆఫర్ చేస్తున్న ప్రత్యేకమైన సభ్యత్వ కార్యక్రమం. దీని ద్వారా అర్హత ఉన్న జియో కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, కంటెంట్, జియో సేవలు మరియు కొన్ని జియో ప్లాన్లకు అనుసంధానించిన అదనపు ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ను మై హోమ్ జియో మరియు జియో అఫీషియల్ సైట్ మరియు UPI యాప్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
టెలికాం రంగంలో జియో 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణ మైలురాయిని పురస్కరించుకుని ఈ కొత్త జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. అయితే, ఇది ఉచితం అని మాత్రం అనుకోకండి. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందాలంటే మీరు రూ. 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకునే యూజర్లకు చాలా VIP బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే, ఇది 5 సెప్టెంబర్ 2027 మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ని ఆగష్టు 20వ తేదీ నుంచి యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటి వరకు మనం ఈ కొత్త జియో ప్రైమ్ మెంబర్‌షిప్ అంటే ఏమిటి అని మాత్రమే తెలుసుకున్నాము. అయితే, ఇప్పుడు ఈ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ అందించే లాభాలు లేదా ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తో వచ్చే మొదటి ప్రయోజనం ‘ప్రైస్ గ్యారంటీ’ అనే ప్రయోజనం. ఇది యూజర్లకు టారిఫ్ హైక్ నుంచి రక్షణ అందిస్తుంది. అంటే, కంపెనీ టారిఫ్ రేట్లు పెంచినా కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న యూజర్లకు 5 సెప్టెంబర్ 2027 యూజర్లకు పాత ధరకే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అయితే, యూజర్ అర్హత కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్ లకు మాత్రమే వర్తిస్తుంది.
రెండో ప్రయోజనం రూ. 600 రూపాయల క్యాష్ బ్యాక్ బెనిఫిట్. ఇందులో రూ. 300 రూపాయల క్యాష్ బ్యాక్ JioHome / Jio PC న్యూ కనెక్షన్ కోసం మరియు రూ. 300 రూపాయలు క్యాష్ బ్యాక్ జియో న్యూ SIM పై మాత్రమే వర్తిస్తుంది. ఇక మూడో ప్రయోజనం గా ‘ముందస్తు యాక్సెస్’ ని అందించింది. సాధారణ యూజర్ మాదిరిగా కాకుండా కొత్త జియో ప్రొడక్ట్స్ మరియు సర్వీస్ లకు జియో ప్రైమ్ మెంబెర్స్ ముందుగా యాక్సెస్ అందుకుంటారు.
Also Read: అండర్ రూ. 7,000 బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ బార్ కావాలా .. బెస్ట్ ఆప్షన్ ఇదిగో.!
ఇక చివరి ప్రయోజనంగా ‘ ప్రాధాన్యత మద్దతు’ ని ప్రకటించింది. అంటే, జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకునే యూజర్లు క్యూతో పని లేకుండా ముందుగా ప్రత్యేకమైన ఆన్ డిమాండ్ సేవలు మరియు కాల్ బ్యాక్ సర్వీస్ లు పొందుతారని జియో తెలిపింది.
అయితే, అమెజాన్ ప్రైమ్ మరియు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కి ఎటువంటి సంభందం లేదని మీరు గమనించాలి. కేవలం పేరులో కొంచెం పోలిక ఉండటం తప్ప ఈ ఆఫర్ లో అమెజాన్ ప్రైమ్ పాత్ర ఏమి లేదు.