ఈ రోజు Reliance jio phone 3 లాంచ్ : అంచనా Price మరియు స్పెక్స్

HIGHLIGHTS

చాలా కాలంగా జియో అభిమానులను ఊరిస్తూ వస్తున్న Reliance jio phone 3 లాంచ్ ఈ రోజు సాకారమయ్యే అవకాశం కొట్టిచ్చినట్లు కనీపిస్తోంది.

రిలయన్స్ యొక్క RIL AGM 2020 అంటే, 43 వ Annual General Meeting ( AGM) కోసం అన్నిఏర్పాట్లను సిద్ధం చేసింది.

Jio Phone మరియు Jio Phone 2 ఫీచర్ ఫోన్లను కూడా తన AGM నుండి లాంచ్ చేసింది కాబట్టి ఈసారి కూడా ఇలానే Reliance jio phone 3 ని లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

ఈ రోజు Reliance jio phone 3 లాంచ్ : అంచనా Price మరియు స్పెక్స్

చాలా కాలంగా జియో అభిమానులను ఊరిస్తూ వస్తున్న Reliance jio phone 3 లాంచ్ ఈ రోజు సాకారమయ్యే అవకాశం కొట్టిచ్చినట్లు కనీపిస్తోంది. ఎందుకంటే, రిలయన్స్ యొక్క RIL AGM 2020 అంటే, 43 వ Annual General Meeting ( AGM) కోసం అన్నిఏర్పాట్లను సిద్ధం చేసింది. వాసవానికి, ఈ మీటింగ్ నుండి రిలయన్స్ చేప్పట్టనున్న పనులు మరియు ఇన్వెస్టుమెంట్స్ గురించి సంస్థ యొక్క అధినేత, ముఖేష్ అంబానీ మాటాడుతారు. కానీ, గత సంవత్సరం జరిగిన AGM నుండే Jio Phone 3  ని లాంచ్ చేయనున్నట్లు అనేక రూమర్లు వెల్లువెత్తగా, అటువంటిది జరగలేదు. కాబట్టి, ఈ సంవత్సరం జరిగవచ్చని ఊహిస్తున్నారు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్న యాంటీ చైనా నినాదం మరియు మేడ్ ఇన్ ఇండియా ఫార్మములా అన్ని కూడా కలగలిపి , Jio Phone 3 విడుదల చేయడానికి ధరి తియ్యవచ్చనే భావన అందరికీ కలుగుతోంది. అన్నింటి కంటే ముఖ్యంగా, ముందుగా తీసుకొచ్చిన Jio Phone మరియు Jio Phone 2 ఫీచర్ ఫోన్లను కూడా తన AGM నుండి లాంచ్ చేసింది కాబట్టి ఈసారి కూడా ఇలానే Reliance jio phone 3 ని లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.    

Reliance jio phone 3 స్పెసిఫికేషన్స్ (గత సంవత్సరం రూమర్లలో ఉన్న స్పెక్స్)

గత సంవత్సరం చాలా నివేదికలలో తెలిపిన ప్రకారం,  సంస్థ ఈ Jio Phone 3 ని ఒక 5- అంగుళాల టచ్చ్ స్క్రీన్ డిస్ప్లేతో ప్రకటించవచ్చని, ఈ హ్యాండ్సెట్ ఒక 2GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో రానున్నట్లు తెలిపాయి. ఇక్కడ చెప్పినదంతా నిజంగా జరిగితే, ముందుగా వచ్చిన 2.4 ఇంచ్ స్క్రీన్ మరియు 4GB స్టోరేజి నుండి ఒక్కసరిగా గణనీయమైన మార్పుకు జియో నాంది పలకనునట్లు చెప్పుకోవచ్చు. అలాగే, ముందుగా వచ్చిన జియో ఫోన్ల వలెనే మెమోరిని పెంచుకునేవేలును కూడా కల్పిస్తుందని అంచనా వేశారు.

ఇక కెమేరాల పరంగా కూడా ఇది బాగానే ఉండవచ్చని అపట్లో చెప్పారు. ఇది ఒక 5MP వెనుక కెమెరా మరియు ముందు 2MP సెల్ఫీ కెమేరాతో తో ఉండవచ్చని ఊహించారు. అయితే, దీని OS గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ, KaiOS పూర్తి ప్రధాన వెర్షన్ లేదా గూగుల్ యొక్క తేలిక పాటి వెర్షన్ అయినటువంటి Android Go OS ఉండవచ్చని అంచనా కూడా వేశారు.

Reliance jio phone 3 ధర (గత సంవత్సర అంచనా ధర)

అదే నివేదికల ప్రకారం, ఒకవేళ ఈ జియోఫోన్ పైన తెలిపిన అప్డేట్స్ తో కనుక తీసుకొస్తే గనుక , ఇది 1500 మరియు 2999 ధరలతో వరుసగా విడుదలైనటువంటి జియోఫోన్ మరియు జియోఫోన్2 కంటే ఎక్కువ ధరతో ఉండవచ్చు. ఈ Jio Phone 3 ప్రైస్ రూ.4,500 గా ఉండవచ్చని అంచనా వేశారు మరియు ముందు ఫోన్ల మాదిరిగానే ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కూడా ఇవ్వవచ్చని ఊహించారు.

ఇక లాంచ్ పూర్తిగా నిజానిజాలు తెలియాలంటే,ఈ రోజు రిలయన్స్ నిర్వహిస్తున్న AGM పూర్తయ్యే వరకు వీచు చూడాల్సిందే.           

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo