Telecom Good News: టెక్నాలజీ పరిధి విస్తరిస్తున్న కొద్దీ మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. టెక్ ను సరిగా దారిలో పెట్టిన భారత ప్రభుత్వం టెలికాం వినియోగదారుల కోసం కొత్త సర్వీస్ ను తీసుకు వచ్చింది. దేశంలో మొబైల్ కనెక్టివిటీ మరింత విస్తరించడానికి వీలుగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ICR) సర్వీస్ ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్ ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ నెంబర్ కంపెనీ సిగ్నల్ లేకున్నా, అక్కడ అందుబాటులో ఉన్న ఇతర మొబైల్ నెట్వర్క్ ద్వారా కాల్ ను చేసుకునే అవకాశం ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
Telecom Good News:
రూరల్ మరియు రిమోట్ ఏరియాలలో నెట్వర్క్ సమస్యను రూపుమాపడానికి ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ICR) ను భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక స్పాన్సర్డ్ కార్యక్రమం డిజిటల్ భారత్ నిధి (DBN) ఈ కొత్త సర్వీస్ ను రివీల్ చేసింది. టెలికాం కంపెనీలు ఇక నుంచి DBN టవర్ తో వారి మౌలిక సదుపాయాలను పంచుకోవాలని ఆదేశించింది.
పైన విషయం గురించి విడమరచి చెప్పాలంటే, యూజర్ మొబైల్ నెట్వర్క్ లేని సమయంలో అదే టవర్ లో ఉన్న ఇతర నెట్వర్క్ ను ఉపయోగించవచ్చు. దేశంలో 27,000 వేలకు పైగా టవర్స్ తో నెట్వర్క్ సమస్య ఎదుర్కొంటున్న 35,000 పైగా గ్రామాలకు విశ్వసనీయమైన మొబైల్ కవరేజ్ ను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త సర్వీస్ ను తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటి వరకు సరైన మొబైల్ నెట్ వర్క్ లేని గ్రామాల్లో ఇప్పుడు ఈ సర్వీస్ తో గొప్ప సౌకర్యం చేకూరుతుంది. ఈ కొత్త పరిణామంతో అన్ని టెలికాం యూజర్లు కూడా ఈ టవర్స్ ద్వారా అంతరాయం లేని మొబైల్ కనెక్టివిటీని అనందించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు, ఈ సర్వీస్ తో కాల్ డ్రాప్ సమస్య నుంచి బయటకు రావడమే కాకుండా వేగవంతమైన డేటా ప్రయోజనం కూడా అందుకోవచ్చు.