రిలయన్స్ జియో కొత్త ప్లాన్స్

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం రెండు చవక ప్రీపెయిడ్ ప్లాన్స్

కేవలం 70 రూపాయల కంటే తక్కువ ధరకే రెండు కొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్స్

అన్లిమిటెడ్ కాలింగ్, డేటా ప్రయోజనాలను ఇస్తుంది

రిలయన్స్ జియో కొత్త ప్లాన్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం రెండు చవక ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. మహమ్మారి కష్టకాలంలో జియో తన కస్టమర్ల కోసం 'ఫ్రీ ఆన్ రీఛార్జ్' ను ప్రకటించింది. దీనితో పాటుగా జియో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన రీఛార్జ్ కోసం కేవలం 70 రూపాయల కంటే తక్కువ ధరకే రెండు కొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను కూడా అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

100 రూపాయల కంటే తక్కువ ధరకే ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లో భాగంగా రెండు కొత్త ప్లాన్స్ ను జత చేసింది. ఈ రెండు ప్లాన్స్ ను 'వన్ ఫ్రీ ఆన్ వన్ రీఛార్జ్' కేటగిరీలోకి తీసుకువచ్చింది. అంతేకాదు, జియో వినియోగదారులకు మరియు జియో ఫోన్ వినియోగదారులకు కూడా ఒకే ధర కాంప్లిమెంటరీ ప్లాన్ గా అందించారు. ఈ రెండు ప్లాన్స్ యొక్క చెల్లుబాటు కాలం 14 రోజులు మరియు అన్లిమిటెడ్ కాలింగ్, డేటా ప్రయోజనాలను ఇస్తుంది.

ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 100MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది. అయితే,ఈ ప్లాన్ ముగిసిన తరువాత మరొక ప్లాన్ మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తరవాత దాన్ని వాడుకోవచ్చు.                

ఇక రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 512MB హై  స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo