రిలయన్స్ జియో సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ : PhonePe ద్వారా 100 రూపాయల కాష్ బ్యాక్ పొందండి 399 రూపాయల ప్లాన్తో
ఈ 399 రూపాయల ప్లాన్ని PhonePe ద్వారా రీచార్జి చేయడం ద్వారా రూ . 299 ధరకే పొందవచ్చన్నమాట.
జియో రెండు సంవత్సరాల వార్షికోత్సవం సందర్బంగా 100 రూపాయల కొత్త కాష్ బ్యాక్ ఆఫర్ని అందిస్తుంది 399 రూపాయల ప్లాన్తో. అంటే , ఈ 399 రూపాయల ప్లాన్ని PhonePe తో రీచార్జి చేయడం ద్వారా రూ . 299 ధరకే పొందవచ్చన్నమాట. అలాగే My Jio యాప్ ద్వారా ఈ రూ . 399 ప్లాన్ని రీచార్జి చేయడం ద్వారా 50 రూపాయల డిస్కౌంట్ ని పొందవచ్చు. దీనికి అదనంగా, PhonePe ద్వారా రీచార్జి చేయడం ద్వారా 50 రూపాయల తక్షణ డిస్కౌంట్ ని కూడా పొందే అవకాశం ఉంటుంది, అంటే రూ . 299 ధర కంటే తక్కువకే ఈ ప్లాన్ అందుకునే అవకాశమన్నమాట.ఈ ఆఫర్ సెప్టెంబరు 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Surveyఈ ప్లాన్ లో భాగంగా, చందాదారులు రోజుకు 1.5GB వర్తింపుతో నెలకు 42GB తోపాటు మొత్తంగా 126 GB డేటాని పొందుతారు 84 రోజుల చెల్లుబాటుతో. అంతేకాకుండా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 100 SMS ల వర్తింపు కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే, ఇటీవలే రిలయన్స్ జియో మరియు డైరీ మిల్క్ భాగస్వామ్యంతో అందించిన 1GB డేటా ఆఫర్ కూడా ఈ సెప్టెంబరు 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి 'తియ్యని డేటా వేడుక చేసుకోవచ్చు' జియో వినియోగదారులు అందరుకూడా ఈ జియో రెండు సంవత్సరాల వార్షికోత్సవం సందర్బంగా.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile