Tecno Spark 50 5G: లాంగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ తో లాంచ్ అయ్యింది.!
లాంగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ తో టెక్నో ఈరోజు స్పార్క్ 50 లాంచ్ చేసింది
ఈ ఫోన్ 18GB ర్యామ్ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది
MIL-STD-810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది
Tecno Spark 50 5G: లాంగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ తో టెక్నో ఈరోజు స్పార్క్ 50 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టెక్నో ఫోన్ ఇండియా లో లాంచ్ అయిన ధర మరియు కంపెనీ ఈ ఫోన్ పై అందించిన లాంచ్ ఆఫర్స్ తో పాటు ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలు ఏమిటో చూద్దామా.
SurveyTecno Spark 50 5G: లాంచ్ ప్రైస్ అండ్ ఆఫర్స్
టెక్నో ఈ ఫోన్ ను 4 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరతో అందించింది. ఈ ఫోన్ 6 జీబీ + 128 జీబీ హైఎండ్ వేరియంట్ ను రూ. 18,999 రూపాయల లాంచ్ ధరతో అందించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి సేల్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ పై కంపెనీ ఎటువంటి అదనపు ఆఫర్స్ కూడా అందించలేదు. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు అఫీషియల్ సైట్ నుండి సేల్ అవుతుంది.
Tecno Spark 50 5G: ఫీచర్స్
ఈ టెక్నో లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 (6nm) ప్రోసెసర్ తో జతగా 6 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది. ఇది మల్టీ టాస్కింగ్ కోసం తగిన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో 12 GB అదనపు ర్యామ్ ఫీచర్ ను కూడా టెక్నో అందించింది. ఇది ఫోన్ ను మరింత స్మూత్ గా నడపడానికి సహాయం చేస్తుంది. ఈ టెక్నో ఫోన్ HiOS 16 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16OS పై నడుస్తుంది.

ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. అయితే, ఫోన్ సన్నగా ఉన్నా కూడా MIL-STD-810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ టెక్నో కొత్త ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ LCD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ 20Hz రిఫ్రెష్ రేట్ మరియు 560 నిట్స్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Redmi 15A 5G: బడ్జెట్ సిరీస్ నుంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రెడ్ మీ.!
కెమెరా పరంగా, ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ కెమెరా జత AI సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6,500mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఛార్జ్ సపోర్ట్ తో ఆకట్టుకుంటుంది. 4×4 MIMO తో మంచి నెట్ వర్క్ సీకర్ గా ఉంటుంది మరియు అంతరాయం లేని నెట్ వర్క్ ఆఫర్ చేస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile