రిలయన్స్ జియో బంపర్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితం
జియో బెస్ట్ అఫర్ ప్రకటించింది
జియోఫోన్ ను ఉచితంగా పొందవచ్చు
2 సంవత్సరాల అన్లిమిటెడ్ సర్వీస్
2021 సంవత్సరంలో జియో బెస్ట్ అఫర్ ప్రకటించింది. కొత్త ఫీచర్ ఫోన్ కొనాలని చేస్తున్నవారికి ఈ అఫర్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, జియో కొత్త అఫర్ తో జియోఫోన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ అఫర్ తో లాంగ్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ సర్వీస్ తోపాటుగా జియోఫోన్ ను కూడా ఉచితంగా పొందవచ్చు. అందుకే, కొత్త ఫోన్ కోనాలనుకునే వారికి ఇది నిజంగా ధమాకా ఆఫర్. ఈ అఫర్ ద్వారా రెండు సంవత్సరాల రీఛార్జ్ ఒకేసారి చేస్తే జియో 4G ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే జియోఫోన్ ను వాడుతున్న కస్టమర్ల కోసం కూడా మంచి ప్లాన్ ని అందించింది.ఈ అఫర్ విశేషాలు ఏమిటో చూద్దాం.
Surveyజియోఫోన్ 2021 ఆఫర్
జియోఫోన్ 2021 ఆఫర్ తో జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.
అంతేకాదు, పైన తెలిపిన అన్లిమిటెడ్ ప్రయోజనాలతో కేవలం ఒక్క సంవత్సరం వ్యాలిడిటీ మాత్రమే కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ క్రింద రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా 12 నెలలకు ఉంటాయి.
అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile