WhatsApp New Update: ఆండ్రాయిడ్ నుంచి iPhone చాట్ ట్రాన్స్‌ఫర్ సహా భారీ ఫీచర్లు విడుదల చేసింది.!

HIGHLIGHTS

వాట్సాప్ ఈరోజు తన యూజర్ల కోసం కొత్త అప్‌డేట్ ను రిలీజ్ చేసింది

ఆండ్రాయిడ్ నుంచి iPhone చాట్ ట్రాన్స్‌ఫర్ సహా భారీ ఫీచర్లు అందించింది

కొత్త మరియు ఉపయోగకరమైన ఫీచర్స్ అందించింది

WhatsApp New Update: ఆండ్రాయిడ్ నుంచి iPhone చాట్ ట్రాన్స్‌ఫర్ సహా భారీ ఫీచర్లు విడుదల చేసింది.!

WhatsApp New Update: ప్రపంచంలో అత్యధికంగా యూజర్లను కలిగిన మెసెంజర్ యాప్ వాట్సాప్, ఈరోజు తన యూజర్ల కోసం కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది. వాట్సాప్ విడుదల చేసిన ఈ కొత్త అప్డేట్ లో ఆండ్రాయిడ్ నుంచి iPhone చాట్ ట్రాన్స్‌ఫర్ సహా భారీ ఫీచర్లు అందించింది. ఈ లేటెస్ట్ అప్డేట్ ద్వారా వాట్సప్ అందించిన కొత్త ఫీచర్లో మరియు వాటి వివరాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

WhatsApp New Update: ఫీచర్స్ ఏమిటీ?

ప్రపంచంవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కొత్తగా భారీ అప్‌డేట్‌ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌ లో Android నుంచి iPhone మధ్య చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ తో పాటు ఇంకా మరిన్ని కొత్త మరియు ఉపయోగకరమైన ఫీచర్స్ అందించింది.

వాస్తవానికి, ఇప్పటి వరకు ఒక ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి ఐఫోన్ లేదా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్ కి వాట్సాప్ ను తరలించడం చాలా కష్టంగా ఉండేది. కానీ వాట్సాప్ అందించిన కొత్త అప్డేట్ తో ఈ సమస్యకు చెక్ పెట్టింది. ఇక నుంచి అటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా మీ మెసేజెస్, ఫోటోలతో పాటు వీడియోలు సైతం సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

WhatsApp New Update

ఇక నుంచి క్లౌడ్ బ్యాకప్ అవసరం లేకుండా నేరుగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అందించింది. జస్ట్ మూడు క్లిక్స్ తో ఈ మొత్తం ప్రోసెస్ అయిపోతుంది. దీనికోసం వాట్సాప్ “Cross Platform Transfer” అనే ఫీచర్ ను జత చేసింది. ఈ ఫీచర్ తో మొత్తం కథనే మార్చేసింది.

Also Read: Vivo V70 FE : వివో అప్ కమింగ్ 200MP కెమెరా ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది.!

ఐఫోన్ లో మల్టీపుల్ అకౌంట్స్

వాట్సాప్ కొత్త అప్డేట్ తర్వాత మీరు ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్స్ ఉపయోగించవచ్చు. ఇందులో పర్సనల్ మరియు వర్క్ స్పేస్ చాట్లను కూడా ఒకే ఫోన్లో ఉపయోగించుకునే అవకాశం వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు ఇప్పుడు అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo