వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ : 98 రుపాయలకే 12GB హై స్పీడ్ డేటా

వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ : 98 రుపాయలకే 12GB హై స్పీడ్ డేటా
HIGHLIGHTS

ఈ ప్లాన్ వినియోగదారులకు 12 GB డేటాను ఇస్తుంది.

వోడాఫోన్ యుజర్ల కోసం డబుల్ డేటాని ప్రకటించింది.

అధిక డేటా కోసం చూస్తున్న వోడాఫోన్ యుజర్ల కోసం డబుల్ డేటాని ప్రకటించింది. వాస్తవానికి ఇది కొత్త డేటా ప్లాన్ కాదు, వోడాఫోన్ యొక్క డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ లో 98 రూపాయల దార్లో 6 GB అందిస్తున్న ప్లాన్ పైన ఇప్పుడు డబుల్ డేటాని ప్రకటించింది. తద్వారా,   ఐడియా తన రూ .98 యాడ్-ఆన్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ చేసేవారికి ఈ తీపి కబురును అందించింది.అంతకుముందు, రూ .98 యాడ్-ఆన్ వినియోగదారులకు 6GB డేటాను 28 రోజుల చెల్లుబాటుతో ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ అదే వ్యాలిడిటీతో వినియోగదారులకు 12 GB డేటాను ఇస్తుంది.

మొదటిగా ఓన్లీటెక్ గుర్తించినట్లుగా, “ఈ అప్‌గ్రేడ్ డేటా అఫర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, డిల్లీ, ముంబై మరియు UP ఈస్ట్ వంటి ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అఫర్ చేస్తోంది ”. అయినప్పటికీ, డేటా రీఛార్జ్‌ చేయదనాయికి కంటే ముందుగా, మీ సర్కిల్ ‌లో ఈ అఫర్ లభ్యతను ఒక్కసారి తనిఖీ చెయ్యడం మంచిది. అంతేకాదు,  రోజువారీ డేటా క్యాప్ కూడా లేదు మరియు వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా లభించే 12GB డేటాను ఉపయోగించడానికి 28 రోజులు వ్యవధి వుంటుంది.

వొడాఫోన్ యాడ్-ఆన్‌లలో భాగమైన ఇతర డేటా ప్లాన్స్  వినియోగదారులకు 1 జిబి డేటా మరియు 24 గంటల చెల్లుబాటును ఇచ్చే రూ .16 ప్లాన్ మరియు వినియోగదారులకు 3 జిబి డేటా మరియు 28 రోజుల చెల్లుబాటును ఇచ్చే రూ .48 ప్లాన్.కూడా ఉన్నాయి. ఈ  రూ .48 నుంచి 98 రూపాయల మధ్య మరికొన్ని ప్లాన్స్ కు స్థలం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ 12 జీబీ డేటాను ఇచ్చే రూ .98 ప్లాన్ మరిన్ని సర్కిళ్లలో కూడా అందుబాటులోకి వస్తుంది. మీరు వోడాఫోన్ యొక్క యాడ్-ఆన్ ప్లాన్స్ ఇక్కడ చూడవచ్చు.

మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ల కోసం ఇక్కడ( LINK ) చూడండి  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo