Airtel free data coupon offer: ఇప్పుడు మరిన్ని ప్లాన్స్ కి విస్తరించింది

Airtel free data coupon offer: ఇప్పుడు మరిన్ని ప్లాన్స్ కి విస్తరించింది
HIGHLIGHTS

Airtel free data coupon offer ఇప్పుడు రూ .289, రూ .448 మరియు రూ .599 టారిఫ్ ప్లాన్స్ కు కూడా విస్తరించింది.

వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ ఖాతాలను Airtel Thanks app ద్వారా రీఛార్జ్ చేస్తే మాత్రమే ఉచిత డేటా కూపన్స్ ఆఫర్ వర్తిస్తుంది.

ఇప్పుడు ఆఫర్ లో మరిన్ని రీఛార్జ్ ప్లాన్లను జోడిస్తోంది.

Airtel free data coupon offer ఇప్పుడు రూ .289, రూ .448 మరియు రూ .599 టారిఫ్ ప్లాన్స్ కు కూడా విస్తరించింది. ఈ ఉచిత డేటా కూపన్ ఆఫర్ ‌ను జూలైలో రూ .219, రూ .249, రూ .279, రూ .298, రూ. 349, రూ. 398, రూ .939, రూ .449, రూ .588, రూ .598, రూ .698 టారిఫ్ ప్లాన్స్ కు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆఫర్ లో మరిన్ని రీఛార్జ్ ప్లాన్లను జోడిస్తోంది.

ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం రూ .289, రూ .448 మరియు రూ .599 యొక్క కొత్త ప్లాన్స్ ఇప్పుడు మీ ప్రస్తుత ప్లాన్స్  వ్యాలిడిటీ కాలానికి గాను అదనపు డేటాను అందించే ఉచిత కూపన్లను అందిస్తున్నాయి. రూ .289 మరియు రూ .448 రీఛార్జ్ ప్లాన్స్  ఇప్పుడు 28 రోజుల వాలిడిటీతో 1 జిబి డేటా విలువైన రెండు కూపన్‌లను అందిస్తుండగా, రూ .599 టారిఫ్ ప్లాన్‌లో 56 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 1 జిబి డేటా నాలుగు కూపన్లు ఉన్నాయి.

అయితే, వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ ఖాతాలను Airtel Thanks app ద్వారా రీఛార్జ్ చేస్తే మాత్రమే ఉచిత డేటా కూపన్స్ ఆఫర్ వర్తిస్తుంది. రూ .448 మరియు రూ .599 టారిఫ్ ప్లాన్లతో డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత చందాతో పాటు అపరిమిత లోకల్, ఎస్‌టిడి మరియు రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 3 జిబి 4 జి డేటా 28 రోజులు వస్తాయి.

మరోవైపు, రూ .599 ప్లాన్‌తో యూజర్లు 2 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు సాధారణ వాయిస్ కాల్స్, రోజుకు 100  ఎస్ఎంఎస్ లను 56 రోజుల వాలిడిటీకి పొందుతారు. రూ .289 ప్లాన్ విషయానికొస్తే, ఇది 28 రోజుల చెల్లుబాటు కోసం ZEE5 కేటలాగ్‌కు యాక్సెస్ ను అందిస్తుంది మరియు మీరు విభిన్న కంటెంట్‌ను ఆస్వాదించడానికి రోజుకు 1.5GB డేటాను తెస్తుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్ మరియు అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందుతారు.

ప్రస్తుతం ఉన్నట్లుగా, రూ .219, రూ .249, రూ .279, రూ. 298, రూ. 349, రూ. 398, రూ. 56 రోజుల చెల్లుబాటుతో నాలుగు 1GB డేటా కూపన్లతో వస్తాయి. అంతేకాకుండా, రూ. 598 మరియు రూ .698 రీఛార్జ్ ప్లాన్స్  ఆరు 1 జీబీ డేటా కూపన్లతో వస్తాయి, ఇవి 84 రోజుల వరకు చెల్లుతాయి.

ఎయిర్‌టెల్ మొబైల్ రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ Click  చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo