Jio vs BSNL best long validity unlimited prepaid plans
Jio vs BSNL: ఉచిత ఆఫర్స్ కి జియో పేరుగాంచిన టెలికాం కంపెనీ అయితే, చవక ధరలో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్న టెలికాం కంపెనీగా బిఎస్ఎన్ఎల్ పేరుపొందింది. ఈ రెండు టెలికాం కంపెనీలు కూడా వాటి నెట్ వర్క్ మరియు సర్వీస్ పరంగా కూడా ప్రాచుర్యం పొందాయి. ఆఫ్ కోర్స్, వీటిలో జియో 5G నెట్ వర్క్ మరియు 4G నెట్ వర్క్ ఆఫర్ చేస్తుండగా, బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4G నెట్ వర్క్ మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే, నెట్ వర్క్ మరియు డేట్ స్పీడ్ 4G నెట్ వర్క్ పై రెండు కూడా మంచి వేగంగా ఉంటాయి. అయితే, అండర్ రూ. 1,000 ధరలో ఈ లాంగ్ అన్లిమిటెడ్ ప్లాన్లు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మరి ఈరోజు ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుందాం.
జియో మరియు బిఎస్ఎన్ఎల్ రెండు టెలికాం కంపెనీలు కూడా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో జియో బ్యాట్ ప్రైస్ లో 5జి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తుంటే, బిఎస్ఎన్ఎల్ 4జి నెట్ వర్క్ పై ఎవరు ఇవ్వలేని ధరలో బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి.
ఇక రూ. 1,000 ఈ టెలికాం కంపెనీలు అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చూస్తే, జియో తన యూజర్ల కోసం అందించిన ఋ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు ఆఫర్ చేస్తున్న రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఆ టెలికాం యూజర్లకు బెస్ట్ ప్లాన్స్ గా నిలుస్తాయి.
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ 5G ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు, 5జి నెట్ వర్క్ పై 90 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అలాగే, 4G నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా మరియు 90 రోజులకు గాను 20GB అదనపు డేటా కూడా అందిస్తుంది.
Also Read: Sony Bravia 2 అండ్ Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!
ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 150 రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 150 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు, డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.